China Military Base In Cambodia : తన దేశంలో ఉన్నవి సరిపోక .. విదేశాల్లోనూ చైనా సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తోంది.
చైనా ఆర్మీ కోసం కాంబోడియా దేశంలోని థాయిలాండ్ బార్డర్ లో ఉన్న రీమ్ నావల్ బేస్ వద్ద సైనిక స్థావరం రెడీ అయిందంటూ ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అమెరికాకు చెందిన రియల్ టైమ్ జియో స్పేషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ “బ్లాక్ స్కై” దీనికి సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్ ను రిలీజ్ చేసింది.
వియత్నాం, థాయిలాండ్, లావోస్ దేశాలతో సరిహద్దు కలిగిన కాంబోడియా దేశంలో చైనా మిలిటరీ బేస్ ఉండటం ఆ దేశాల భద్రతకు కూడా పెద్ద ముప్పే.
Also read : Hyderabad Rains: సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ట్రాఫిక్ ఆంక్షలు ఇవే
కాంబోడియా దేశంలో చైనా మిలిటరీ బేస్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని , త్వరలోనే అక్కడ యుద్ధ నౌకలను డ్రాగన్ మోహరిస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఇండో-పసిఫిక్ సముద్ర జలాల్లోని తూర్పు ప్రాంతంలో సైనిక బలాన్ని పెంచుకునేందుకు ఈ మిలిటరీ బేస్(China Military Base In Cambodia) చైనాకు ఉపయోగ పడుతుందని చెబుతున్నారు. ఈ రహస్య మిలిటరీ బేస్ ను చైనా కోసమే నిర్మిస్తున్నారనే ఆరోపణలను గతంలో చైనా, కాంబోడియా రెండూ ఖండించాయి.
జిబౌటీలోని చైనా మిలిటరీ బేస్ డిజైన్ లోనే ఇది కూడా..
ఇప్పటికే ఆఫ్రికాలోని జిబౌటీ (Djibouti)లో చైనా నౌకాదళానికి మిలిటరీ బేస్ ఉంది. ఇప్పుడు కాంబోడియాలో నిర్మిస్తున్న నేవీ మిలిటరీ బేస్ కూడా గతంలో జిబౌటీ లో చైనా నిర్మించిన మిలిటరీ బేస్ డిజైన్ లోనే ఉందని తెలుస్తోంది. జిబౌటీ, కాంబోడియా మిలిటరీ బేస్ లు రెండింటిలోనూ యుద్ధ నౌకల రాకపోకల కోసం , షెల్టర్ కోసం నిర్మించిన ప్రదేశాల కొలతలు అచ్చం ఒకేలా ఉన్నాయి. దీంతో కాంబోడియా మిలిటరీ బేస్ ను కూడా చైనా కోసమే నిర్మించారనే అనుమానాలు బలపడుతున్నాయి. చైనాకు చెందిన టైప్ 003 ఫుజియాన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ యుద్ధ నౌక రాకపోకలకు ఆతిథ్యం ఇచ్చేందుకు అనువుగా ఉండేలా కాంబోడియాలో ఈ మిలిటరీ బేస్ ను కట్టారని నిపుణులు చెబుతున్నారు. చైనా, కంబోడియా నావికా దళాలు కలిసి ఈ సంవత్సరం మార్చిలో మొదటిసారిగా సైనిక విన్యాసాలు చేశాయి.
Also read : Rain Alert Today : తెలంగాణలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఏపీలోని 9 జిల్లాల్లో ఇవాళ వానలు