Samantha: కాశ్మీరులోయలో కన్యాకుమారిరో!

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి చేయబోయే సినిమా షూటింగ్‌ కోసం సమంత కాశ్మీర్‌లో ఉంది.

  • Written By:
  • Updated On - May 13, 2022 / 01:06 PM IST

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి చేయబోయే సినిమా షూటింగ్‌ కోసం సమంత కాశ్మీర్‌లో ఉంది. ఈ సందర్భంగా సమంత కాశ్మీర్ నేచర్ ను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తోంది. ప్రకృతి మధ్య ఆమె కుర్చీపై గొడుగు పట్టుకొని కూర్చున్న ఫొటో ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. “S OL I TU DE” అని క్యాప్షన్ ఇచ్చింది. సమంత 15 రోజుల నుంచి విజయ్ దేవరకొండ , శివ నిర్వాణ కాంబోలో  తెరకెక్కె సినిమా కోసం షూటింగ్ చేస్తోంది. అయితే సమంత, విజయ్ తమ పుట్టినరోజు వేడుకలను కాశ్మీర్ లోనే జరుపుకోవడం విశేషం. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్వరలో కాశ్మీర్ తొలి షెడ్యూల్‌ను పూర్తి చేయనున్నారు. దీంతో షూటింగ్ గ్యాప్ లో ప్రకృతితో ఎంజాయ్ చేస్తూ ఫొటోలకు ఫొజులిచ్చింది ఈ బ్యూటీ.

తాజాగా సామ్ ఓ బోల్డ్ పిక్ ని పోస్ట్ చేసింది. ముఖం కనిపించకుండా ఓ బోల్డ్ పిక్ ని షేర్ చేయగా అది నెట్టింట వైరల్ గా మారింది. కేవలం బాత్ టవల్ శరీరానికి కప్పుకుని బట్టలేకుండా సమంత బోల్డ్ గా ఫోజు ఇచ్చింది. ఇది మిర్రర్ సెల్ఫీ. ఓ అడ్డం ముందు నిల్చుని సామ్ ఈ ఫోజు ఇచ్చింది. ఈ ఫోటో పై నీరజ కోన, సమంత పరస్పరం సంభాషించుకున్నారు. నువ్వు చాల గ్రేట్ అంటూ నీరజ కామెంట్ పెట్టగా .. నిన్ను చాలా మిస్ అవుతున్నా త్వరగా వచ్చే, థ్యాంక్యూ అంటూ సమంత రిప్లై ఇచ్చింది.