Russia Ukraine War: రష్యా దాడిలో 49 మంద్రి ఉక్రెయిన్ పౌరులు మృతి

రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రారంభమై ఏడాదిన్నర కావొస్తుంది. అయినప్పటికీ వివాదం ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు.

Russia Ukraine War: రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రారంభమై ఏడాదిన్నర కావొస్తుంది. అయినప్పటికీ వివాదం ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి దాడి చేసింది. గురువారం జరిగిన ఈ దాడిలో ఆరేళ్ల బాలుడితో సహా కనీసం 49 మంది చనిపోయారు. ఉక్రెయిన్ అధికారుల ప్రకారం ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా డ్రోన్ దాడులు చేసింది.

ఖార్కివ్‌లోని తూర్పు ప్రాంతంలోని కిరాణా దుకాణం మరియు ఒక కేఫ్‌పై దాడులు జరిగినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రష్యా సరిహద్దు ప్రాంతంలోని కుప్యాన్స్క్ జిల్లాలో దాడి జరిగిందని ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ చెప్పారు. స్పెయిన్‌లో 50 మంది యూరోపియన్ నాయకుల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ఆయన రష్యా ఉగ్రవాదాన్ని అరికట్టాలని అన్నారు. రష్య ఉద్దేశపూర్వక ఉగ్రవాద దాడికి పాల్పడుతుందని జెలెన్స్కీ అన్నారు. ఈ దాడికి సంబంధించి ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ మాట్లాడుతూ ఇందులో కనీసం 49 మంది మరణించారని తెలిపారు.

Also Read: 50 Mega Pixel Front Camera : సెల్ఫీ కోసం 50 మెగా పిక్సెల్.. వివో నుంచి సరికొత్త మోడల్..!