Site icon HashtagU Telugu

Russia New President : పుతిన్ టైం క్లోజ్.. రష్యాకు కొత్త ప్రెసిడెంట్ ?

Vladimir Putin

Vladimir Putin

Russia New President : ప్రైవేటు ఆర్మీ “వాగ్నర్ గ్రూప్” తిరుగుబాటు ముగిసిన తర్వాత రష్యాను నిశ్శబ్దం  ఆవరించింది.

ప్రెసిడెంట్ పుతిన్ మీడియా ముందుకు రావడం లేదు.

ఆయన పొలిటికల్ యాక్టివిటీ తగ్గిపోయింది.

పుతిన్‌పై తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ కూడా గత 24 గంటలుగా కనిపించడం లేదు. ప్రిగోజిన్ చివరిసారిగా శనివారం అర్ధరాత్రి రష్యాలోని రోస్టోవ్ ఆన్ డాన్ సిటీ లో కారు డ్రైవ్ చేస్తూ కనిపించారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా చెప్పుకునే పుతిన్ ఇమేజ్ ను .. ప్రిగోజిన్ కిరాయి సైన్యం చేసిన తిరుగుబాటు దెబ్బతీసింది.  ప్రిగోజిన్ ను లొంగదీసుకోకుండా రాజీ కుదుర్చుకోవడం పుతిన్ ప్రతిష్టను దిగజార్చిందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే ప్రిగోజిన్ రష్యా నుంచి బెలారస్ కు చేరుకున్నాడని రష్యా ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. వాగ్నర్ గ్రూప్ ప్రైవేట్ ఆర్మీలోని సైనికుల కుటుంబాలను రష్యా ఆర్మీ బ్లాక్ మెయిల్ చేసి .. ఈ తిరుగుబాటును కొలిక్కి తెచ్చిందనే వాదన కూడా వినిపిస్తోంది.  ప్రిగోజిన్ సాయుధ తిరుగుబాటు వల్ల వ్లాదిమిర్ పుతిన్ రాజకీయంగా బలహీనపడ్డారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Also read : Manipur Violence: మణిపూర్‌లో ఉగ్రవాదుల 12 బ్యాంకర్లను ధ్వంసం చేసిన బలగాలు

పుతిన్ యొక్క ప్రస్తుత అధ్యక్ష పదవీకాలం వచ్చే ఏడాది(2024) నాటికి ముగుస్తుంది. రష్యాలోని అన్ని వ్యాపార, వాణిజ్య, రాజకీయ వర్గాలు ఇప్పుడు 2024 అధ్యక్ష ఎన్నికల గురించి ఆలోచించడం ప్రారంభించాయి. తాజాగా సైనిక తిరుగుబాటుదారులతో పుతిన్ రాజీకి వచ్చిన నేపథ్యంలో.. ఫ్యూచర్ లో వ్లాదిమిర్ పుతిన్‌పై ఆధారపడాలా ? వద్దా ? అనే చర్చ రష్యా రాజకీయ వర్గాల్లో వాడివేడిగా జరుగుతోంది. రష్యాకు ఎదురయ్యే సైనిక సవాళ్ళను పుతిన్ కంటే సమర్ధంగా ఎదుర్కోగల మరో వ్యక్తి(Russia New President) ఎవరైనా ఉన్నారా అనే వెతుకులాటను  అవి ప్రారంభించనున్నాయి. ఈ లెక్కన గత 23 ఏళ్లుగా రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్న పుతిన్ కు పదవీకాలం దగ్గర పడినట్టేనని బీబీసీ ఒక కథనాన్ని పబ్లిష్ చేసింది. రష్యాలో నాయకత్వ మార్పు దిశగా అడుగులు పడుతున్నాయని వ్యాఖ్యానించింది.