Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద డ్రోన్ దాడి

రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య ఫిబ్రవరి 2022 నుండి యుద్ధం కొనసాగుతోంది. ఈ రోజు శనివారం రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై అతిపెద్ద డ్రోన్ దాడిని నిర్వహించింది.

Russia Ukraine War: రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య ఫిబ్రవరి 2022 నుండి యుద్ధం కొనసాగుతోంది. ఈ రోజు శనివారం రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై అతిపెద్ద డ్రోన్ దాడిని నిర్వహించింది. రాజధాని కీవ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది.ఉక్రెయిన్‌పై రష్యా 75 ఇరాన్ తయారు చేసిన షహీద్ డ్రోన్‌లను ప్రయోగించిందని, వాటిలో 74 ధ్వంసమయ్యాయి. ఈ దాడి కైవ్‌పై డ్రోన్ ద్వారా జరిపిన అతిపెద్ద వైమానిక దాడిగా పరిగణిస్తున్నారు. కీవ్‌పై గంటలపాటు జరిగిన డ్రోన్ దాడిలో ఐదుగురు పౌరులు గాయపడ్డారు. గాయపడిన వారిలో 11 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. దాడిలో అనేక భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. నాలుగు విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. దీంతో కైవ్ ప్రాంతంలో 17 వేల మంది విద్యుత్తు లేకుండా కష్టాలు పడ్డారు.

Also Read: Revanth Reddy: ఆదివారం రేవంత్ ప్రచార షెడ్యూల్