Site icon HashtagU Telugu

Road Accident: బొల్తా కొట్టిన బస్సు, ఇద్దరు ప్రయాణికులు దుర్మరణం

Crime

Crime

అతివేగమో, నిర్లక్ష్యమో ఏమో కానీ రోడ్డు ప్రమాదాలు జరగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలోని యాదాద్రి జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా… పలువురికి గాయాలయ్యాయి. మంగళవారం ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం సమీపంలోని ఎలక చెట్టు వద్ద ప్రమాదవశాత్తు ఆర్టీసీ ఇంద్ర బస్సు బోల్తా పడింది.

హైదరాబాద్ నుండి మార్కాపురం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడ్డ ప్రయాణికులను హుటాహుటిన 108 లో యర్రగొండపాలెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 9 మంది ప్రయాణికులు ఉన్నారు.

Also Read: Sharmila: చిత్తశుద్ధి ఉంటే ఈ ఎన్నికల్లోనే మీ సీటును త్యాగం చేయండి: కేటీఆర్ కు షర్మిల పంచ్