Free Bus Survices: మహిళలకు ఫ్రీ టికెట్..ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి?

ఉచిత బస్ ప్రయాణం పట్ల మహిళాలోకం ఆనందం వ్యక్తం చేస్తుంటే దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే నష్టాల్లోనుండి బయటికొస్తున్న ఆర్టీసీ మీద మహిళలకు ఉచిత ప్రయాణం హామీ

Published By: HashtagU Telugu Desk
Rs Praveen

Rs Praveen

Free Bus Survices: ఉచిత బస్ ప్రయాణం పట్ల మహిళాలోకం ఆనందం వ్యక్తం చేస్తుంటే దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే నష్టాల్లోనుండి బయటికొస్తున్న ఆర్టీసీ మీద మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలు పెను భారాన్ని మోపబోతున్నదన్నారు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఇది దాదాపుగా 50 వేల మంది ఆర్టీసి కార్మికుల జీవితాల మీద కూడా ప్రభావం చూపబోతున్నదని. అంతే కాకుండా చాలా గ్రామాలకు ఆర్టీసి బస్సులు తెలంగాణ వచ్చినప్పటినుండి వివిధ కారణాల వల్ల ఆపేశారు. మళ్లీ ఆ సర్వీసులను పునరుద్దరిస్తారా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మిగిలిందిన్నారు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్. మహిళలు అందరూ ఆర్టీసీ బస్ లలో ప్రయాణం చేయడంతో
లక్షలాది మంది ఆటో డ్రైవర్లు తమకు తగినంత ప్యాసింజర్లు దొరకక రోడ్ల మీద పడతామేమోనని భయపడుతున్నారు అన్నారు. ఒకవేళ అదే జరిగితే ఊర్లల్లో తగిన పని దొరక్క పట్నాలకు వలస వచ్చి రేకుల షెడ్లలో ఉంటూ కిరాయి ఆటోలను నడుపుతూ పొట్టగడుపుకుంటున్న ఆటో డ్రైవరు సోదరులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read: Gutka Advertisements: బాలీవుడ్ హీరోలకు మోడీ షాక్

  Last Updated: 11 Dec 2023, 01:29 PM IST