Neopolis: ప్రముఖ లగ్జరీ రెసిడెన్షియల్ నిర్మాణ సంస్థ “ది కాస్కేడ్స్ నియోపోలిస్” (Neopolis) నగరంలో భారీ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. జీహెచ్ఆర్ ఇన్‌ఫ్రా, లక్ష్మీ ఇన్‌ఫ్రా, అర్బన్ బ్లాక్స్ రియాలిటీ ప్రమోటర్ల ఉమ్మడి భాగస్వామ్య సంస్థ అయిన జీహెచ్ఆర్ లక్ష్మీ అర్బన్ బ్లాక్స్ ఇన్‌ఫ్రా ఎల్ఎల్ పి “ది కాస్కేడ్స్ నియోపోలిస్ పేరిట రూ. 3169 కోట్లతో లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను ఆవిష్కరించింది. దాదాపు 217 మీటర్ల ఎత్తుతో ఐదు 63 అంతస్తుల టవర్లు కలిగి ఉన్న ఈ ప్రాజెక్ట్, సమకాలీన డిజైన్, పర్యావరణ అనుకూల జీవనంతో పాటు లగ్జరీ లివింగ్ కు ల్యాండ్‌మార్క్‌గా తీర్చిదిద్దనుంది. 2030 మార్చి నాటికి కొనుగోలుదారులకు అప్పగించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ సంస్థ తెలిపింది. ఈ ప్రాజెక్ట్ 7.34 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. 3BHK, 4BHK అపార్ట్‌మెంట్‌లు 2,560 చదరపు అడుగుల నుండి ఆకర్షణీయమైన 4,825 చదరపు అడుగుల వరకు విస్తరించి ఉంటాయని తెలిపింది.
Also Read: MLA Ganta Srinivasa Rao: జగన్ రాజకీయాలలో ఉండటానికి అనర్హుడు: ఎమ్మెల్యే గంటా
వీటితో పాటు 54వ అంతస్తులో ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ కలిగి ఉన్న 10 ప్రత్యేకమైన ట్రిపుల్ పెంట్‌హౌస్‌లు ఉంటాయి. గార్డెన్, ప్యాడిల్ టెన్నిస్, పికిల్ బాల్ కోర్ట్, యోగా డెక్, ఔట్ డోర్ జిమ్, రెండు హెలిప్యాడ్స్ వంటి ప్రత్యేకతలు ఈ ప్రాజెక్టు ఉన్నాయి. ఏడు అంతస్తులలో పార్కింగ్ (2 బేస్‌మెంట్ + 5 పోడియం) ఉండటం వల్ల అపార్ట్మెంట్ నివాసితులకు సౌకర్యాల పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. కాగా ఈ ప్రాజెక్ట్‌కు ఎస్‌బీఐ రూ.900 కోట్ల నిధులను సమకూర్చిందని సంస్థ డెసిగ్నేటెడ్ భాగస్వాములు లక్ష్మీ నారాయణ, శరత్ వెల్లడించారు.