Elections 2023: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది .మధూర్ మండలం సలాబత్ పూర్ చెక్ పోస్టు దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.2.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి కారులో వస్తున్న వ్యక్తి నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం రెండు రోజుల క్రితం తెలంగాణాలో ఎన్నికల కోడ్ ని అమలు చేసింది. కోడ్ అమలు నేపథ్యంలో రూ.50,000 మించి నగదు తీసుకెళ్ళరాదు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకెళ్లాల్సి వస్తే సంబంధిత పత్రాలు చూపించాల్సి ఉంటుంది.ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ చేపట్టారు పోలీసులు.
Also Read: World Cup 2023: భారత్-పాక్ మ్యాచ్‌కు బాంబు బెదిరింపు