Site icon HashtagU Telugu

LSG vs MI: డూ ఆర్ డై మ్యాచ్ లోనూ రోహిత్ విఫలం

Rohit Sharma Record

Rohit Sharma Record

LSG vs MI: ఐపీఎల్ 2023లో రోహిత్ శర్మ ప్రదర్శన ఆకట్టుకోలేకపోయింది.ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్ మొత్తంగా 324 పరుగులు మాత్రమే చేశాడు. 134 స్ట్రైక్ రేట్ వద్ద కేవలం రెండు అర్ధసెంచరీలు మాత్రమే నమోదు చేశాడు. ఇదిలా ఉండగా ఈ రోజు జరుగుతున్న ఎలిమినేటర్ డూ ఆర్ డై మ్యాచ్ లోనూ రోహిత్ విఫలమయ్యాడు.

ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో రోహిత్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ లో రోహిత్ కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. మొదట బ్యాటింగ్ కు వచ్చిన రోహిత్ శర్మ సిక్సర్‌తో తన ఖాతా తెరిచాడు. అదే ఓవర్‌లో హిట్‌మ్యాన్ మరో రెండు ఫోర్లు కొట్టాడు. అయితే తర్వాతి ఓవర్‌లో నవీన్-ఉల్-హక్‌ బౌలింగ్ లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ బిగ్ మ్యాచ్‌లో 10 బంతులు ఎదుర్కొన్న హిట్‌మన్ కేవలం 11 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ప్లేఆఫ్‌లలో హిట్‌మ్యాన్ మొత్తం 14 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ప్లేఆఫ్స్‌లో అతని అత్యధిక స్కోరు 26 పరుగులు కావడం గమనార్హం.

Read More: IPL 2023: సెంచరీ వీరుడికి ప్రీతి హాట్ హగ్