Site icon HashtagU Telugu

BRS Party: బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో చోరీ

Telangana Bhavan

BRS Party

BRS Party: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో చోరీకి యత్నించారు, దొంగలు పార్టీ కార్యాలయంలోని రెండు కంప్యూటర్లను దోచుకెళ్లినట్లు తేలింది. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేసి ఫర్నీచర్‌ను పార్టీ కార్యాలయానికి తరలించారు, పార్టీ కార్యాలయం దగ్గర సెక్యూరిటీ లేకపోవడంతో అగంతకులు రెండు కంప్యూటర్లను అపహరించారు. గుర్తు తెలియని వ్యక్తులు కార్యాలయం వెనుక నుంచి అద్దాలు పగలగొట్టి ఆఫీస్‎లోని రెండు కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి పీఏ వినోద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ 64 స్థానాల్లో గెలిచి రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా కారు పార్టీ 39సీట్లకే పరిమితం అయింది.

Also Read: Kim Jong Un: ఎక్కువ మంది పిల్లల్ని కనాలని కిమ్ కన్నీళ్లు