Site icon HashtagU Telugu

Rishi Sunak Visit Temple: సతీసమేతంగా అక్షరధామ్ దేవాలయాన్ని సందర్శించిన బ్రిటన్ ప్రధాని..!

Rishi Sunak Net Worth

Compressjpeg.online 1280x720 Image 11zon

Rishi Sunak Visit Temple: యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి రిషి సునక్ (Rishi Sunak) ఎప్పటికప్పుడు హిందూ మతంపై తనకున్న విశ్వాసాన్ని చూపిస్తున్నారు. ప్రధానమంత్రి కాకముందు అయినా, ప్రధానమంత్రి అయిన తర్వాత అయినా.. హిందువునైనందుకు గర్విస్తున్నానని చాలాసార్లు చెప్పారు. జీ-20 సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన రిషి సునక్.. హిందూ మతంపై తనకు ఎంత విశ్వాసం ఉందో మరోసారి చాటిచెప్పారు. ఆదివారం ఉదయం (10 సెప్టెంబర్ 2023), సునక్ తన భార్యతో కలిసి ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించడానికి (Rishi Sunak Visit Temple) చేరుకున్నారు. ఆయన 45 నిమిషాల పాటు అక్కడే ఉన్నారు.

వార్తా సంస్థ ANI ప్రకారం.. రిషి సునక్ చాలా సేపు పాటు ఆలయంలో ఉన్నారని అక్షరధామ్ ఆలయ డైరెక్టర్ జ్యోతింద్ర దవే చెప్పారు. రుషి సునాక్ హిందూ సంప్రదాయాలను పాటిస్తూ, భగవంతుడిని దర్శించుకున్నారని చెప్పారు. దేవాలయం ప్రాంగణంలో పాదరక్షలు లేకుండా నడుస్తూ భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్నారన్నారు. ఆయన సనాతన ధర్మానికి చాలా సన్నిహితుడనే విషయాన్ని ఆయనను కలిసిన తర్వాత అర్థమైందని తెలిపారు. ఆయన అంతకుముందు తమను సంప్రదించారని, ఏ సమయంలో రావచ్చు? అని అడిగారని, ‘‘మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రండి’’ అని చెప్పామని తెలిపారు. దేవాలయంలో ఆయన సతీ సమేతంగా పూజలు చేశారని, హారతి ఇచ్చారని తెలిపారు.

Also Read: Viral Video: మనిషి వ్యాయామం ..పిల్లి పుష్-అప్‌: వైరల్ వీడియో

దేవాలయంలోని ప్రతి అంశాన్నీ తాము వారికి వివరించామన్నారు. ఈ దేవాలయం నమూనాను వారికి బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు. ఇక్కడ ప్రతి క్షణం ఆయన చాలా ఆనందంగా గడిపారని చెప్పారు. అక్షత కూడా చాలా సంతోషించారన్నారు. అవకాశం దొరికిన ప్రతిసారీ తాను ఈ దేవాలయాన్ని సందర్శిస్తానని చెప్పారని తెలిపారు. రుషి, అక్షత దంపతులు ఈ దేవాలయానికి రావడానికి ముందే ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

అంతకముందు.. శనివారం నాడు తన పర్యటన గురించిన సమాచారం ఇచ్చారు. తన ‘హిందూ’ మూలాలపై గర్వం వ్యక్తం చేస్తూ, G20 సమ్మిట్ మధ్య భారతదేశంలోని ఆలయాన్ని సందర్శించడానికి తనకు సమయం దొరుకుతుందని రిషి సునక్ శనివారం ఆశాభావం వ్యక్తం చేశారు. హిందువుగా ఉన్నందుకు గర్విస్తున్నట్లు, రిషి సునక్ ఒక రోజు క్రితం మీడియాతో మాట్లాడుతూ.. “నేను హిందువుగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. నేను ఇలా పెరిగాను. నేను ఇలానే ఉన్నాను. నేను ఇక్కడే ఉంటానని ఆశిస్తున్నాను. తరువాతి రోజుల్లో నేను గుడికి వెళ్ళగలను. మేము ఇటీవల రక్షాబంధన్ జరుపుకున్నాము.” అని ఆయన తెలిపారు.