RGV: ప‌వ‌న్ వ‌ర్సెస్ బ‌న్నీ.. ఆర్జీవీ షాకింగ్ పోల్

  • Written By:
  • Publish Date - February 17, 2022 / 03:13 PM IST

కాంట్ర‌వ‌ర్సీల‌కు కేర్ ఆఫ్ అడ్ర‌స్ అయిన మిస్ట‌ర్ వివాదాల రారాజు రామ్ గోపాల్ వ‌ర్మ‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను మ‌రోసారి కెలికాడు. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే, ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన భీమ్లా నాయ‌క్ చిత్రం ఈ నెల 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. భీమ్లా నాయ‌క్ తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ అండ్ పీకే ఫ్యాన్స్‌ను రెచ్చ‌గొట్టేలా సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్వీట్ చేశాడు ఆర్జీవీ. భీమ్లా నాయ‌క్ మూవీ హిందీలో కూడా రిలీజ్ అవడం గొప్ప విష‌య‌మ‌న్న వ‌ర్మ‌, అల్లు అర్జున్ పుష్ప మూవీ రికార్డ్స్‌తో లింక్ పెట్టాడు.

పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కిన పుష్ప మూవీ, బాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన సంగ‌తి తెలిసిందే. పుష్ప మూవీతో బాలీవుడ్‌లో బ‌న్నీ క్రేజ్ ఓ రేంజ్‌లో పెరిగింది. దీంతో ఇప్పుడు భీమ్లా నాయ‌క్ హిందీలో విడుద‌ల అవుతున్న క్ర‌మంలో, పుష్ప క‌న్నా భీమ్లా నాయ‌క్ పెద్ద సినిమా అని, బ‌న్నీ క‌న్నా తాను పెద్ద‌వాడిన‌ని నిరూపించుకునే అవకాశం ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వ‌చ్చింద‌ని ట్వీట్ చేశాడు. అంత‌టితో ఆగ‌ని ఆర్జీవీ.. హిందీలో బ‌న్నీ పుష్ప మూవీ కన్నా, పవన్ భీమ్లా నాయక్ సినిమా పెద్ద సినిమాగా నిలుస్తుందా.. అని పోల్ కూడా పెట్టారు. దీంతో ఎస్ అని కొంద‌రు, నో అని కొంద‌రు ఓటు వేయ‌గా, రిజ‌ల్స్ ప్ర‌స్తుతం స్ట‌డీగా ఉంది. మ‌రి వ‌ర్మ పోల్‌లో ఎవ‌రు గెలుస్తారో తెలియాలంటే కొన్ని గంట‌లు ఆగాల్సిందే.