CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణ అనంతరం మంత్రులకు శాఖలు కేటాయించే అంశంపై స్పష్టతనిచ్చారు. “ఇప్పటి వరకు నా వద్ద ఉన్న శాఖల నుంచే కొత్త మంత్రులకు కేటాయిస్తా. కొత్తగా ఎవరికైనా ఇచ్చే శాఖలు నా దగ్గర ఉన్నవే. పాత మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పులు ఉండవు,” అని ఆయన తెలిపారు. దీంతో తాత్కాలికంగా పాత మంత్రుల శాఖలు యథాతథంగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
Nicholas Pooran: నికోలస్ పూరన్ రిటైర్మెంట్‌కు కారణం ఇదేనా?
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద హోం, మున్సిపల్ పరిపాలన, క్రీడలు, విద్య సహా మొత్తం 11 కీలక శాఖలు ఉన్నాయి. వీటిలో కొన్ని కొత్త మంత్రులకు బదిలీ చేసే అవకాశమున్నప్పటికీ, మిగతా శాఖలు ఆయన వద్దనే కొనసాగనున్నాయన్నది తాజా సమాచారం.
“నేను ఢిల్లీకి వచ్చేది కేవలం వ్యక్తిగత సమావేశాల కోసం కాదు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో విజయవంతంగా కొనసాగిన కుల గణన అంశంపై వివరాలు పంచుకోవడానికే వచ్చాను,” అని సీఎం పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం పట్ల అవగాహన పెరిగేలా కులగణన కీలకమని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై రేవంత్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. “నేను అధికారంలో ఉన్నంతవరకూ కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ ఉండదు. వారే తెలంగాణకు అసలైన శత్రువులు. రాష్ట్రాన్ని అనేక దశల్లో వెనక్కి తీసుకెళ్లిన బాధ్యత వారిపై ఉంది,” అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Aadhaar Free Update: ఆధార్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్.. మూడు రోజులే ఛాన్స్!