TSPSC Chairman: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ.. సీఎం రేవంత్ నిర్ణ‌యం..?

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC Chairman) ప్రక్షాళనపై సీఎం రేవంత్ స‌ర్కార్‌ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే కొత్త‌వారిని నియమించేందుకు అధికారులు క‌సర‌త్తు షురూ చేసింది.

  • Written By:
  • Updated On - January 23, 2024 / 08:45 AM IST

TSPSC Chairman: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC Chairman) ప్రక్షాళనపై సీఎం రేవంత్ స‌ర్కార్‌ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే కొత్త‌వారిని నియమించేందుకు అధికారులు క‌సర‌త్తు షురూ చేసింది. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ముగియగా కమిషన్ ఛైర్మన్ గా ఇద్దరు ఐపీఎస్​లతో పాటు ఇద్దరు ప్రొఫెసర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని రావ‌డంతో టీఎస్​పీఎస్సీ మెంబర్స్ నియామకంపై ఈ వారంలోగా నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

అయితే అందుతున్న స‌మాచారం ప్ర‌కారం టీఎస్‌పీఎస్సీ ఛైర్మ‌న్‌గా మాజీ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డికి అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదానికి ప్ర‌భుత్వం సిఫార్సులు చేసిన‌ట్లు స‌మాచారం. అయితే మహేందర్ రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్ కమిటీ ప‌రిశీలిస్తోంది. తెలంగాణకు చెందిన అధికారులు ఎవ‌రూ లేకపోవడంతో మాజీ డీజీపీ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతున్న‌ట్లు తెలుస్తోంది. చైర్మన్ కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్న‌ట్లు ప్ర‌భుత్వ అధికారులు పేర్కొన్నారు.

టీఎస్పీఎస్సీ చైర్మన్‌ పదవి కోసం మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి 50 పైగా అప్లికేషన్లు రాగా వచ్చిన వాటిలో సీఎస్ శాంతి కుమారి, లా సెక్రెటరీ నిర్మలా దేవి కలిసి షార్ట్ లిస్ట్ చేసి మహేందర్ రెడ్డి పేరును మాత్రమే గవర్నర్ అనుమతి కోసం పంపినట్లు సమాచారం.

Also Read: YSRCP : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్సీ జంగా..!

గత ప్రభుత్వ హాయాంలో నియమితులైన టీఎస్​పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డితో పాటు.. బోర్డు సభ్యులు రాజీనామా చేసిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఈ క్ర‌మంలోనే రేవంత్ స‌ర్కార్ బోర్డు ఛైర్మ‌న్ ప‌ద‌వికి, స‌భ్యుల కోసం ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించింది. టీఎస్​పీఎస్సీ లో ఛైర్మన్ తో పాటు 9 మంది స‌భ్యుల‌ పోస్టుల కోసం 370కిపైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. నియామకాల్లో పారదర్శకంగా ఉండేందుకు రేవంత్ ప్ర‌భుత్వం టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనకు పూనుకుంది. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాన‌ని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ పోస్టుల భ‌ర్తీ కోసం సన్నాహాలు చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.