Site icon HashtagU Telugu

Suicide: సూర్యాపేటలో స్కూల్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Suicide

Suicide:సూర్యాపేట జిల్లాలో రెసిడెన్షియల్‌ పాఠశాలకు చెందిన 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది .మోతె మండలం బుర్కచర్ల గ్రామానికి చెందిన ఇరుగు ఆనంద్-జ్యోతి దంపతుల కుమార్తె అస్మిక ఇమాంపేట ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఈ నెల 10న అదే రెసిడెన్షియల్‌ స్కూల్‌లో ఇంటర్మీడియట్‌ చదువుతున్న వైష్ణవి అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ నేపథ్యంలో పాఠశాలలో విద్యార్థులు భయాందోళనకు గురికాకుండా నాలుగు రోజుల పాటు హోం సిక్ లీవ్ పెట్టారు. దీంతో అస్మిక తన ఇంటికి వచ్చింది.

కాగా అస్మిక తల్లి జ్యోతి యథావిధిగా పనికి వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చి చూసే సరికి అస్మిక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. అయితే అదే రోజు ఆమె తిరిగి పాఠశాలకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో అస్మిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read: Marri Janardhan Reddy: సొంత డబ్బుతో స్కూల్ కట్టించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే