Site icon HashtagU Telugu

RCB Official Statement: తొక్కిసలాట ఘటనపై స్పందించిన ఆర్సీబీ!

RCB Official Statement

RCB Official Statement

RCB Official Statement: బెంగళూరులో బుధవారం ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటపై ఆర్‌సీబీ ఫ్రాంచైజీ నుండి అధికారిక ప్రకటన (RCB Official Statement) విడుదలైంది. ఈ ప్రకటనలో అందరి భద్రత జట్టుకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. తొక్కిసలాట సమాచారం అందిన వెంటనే భద్రతా సంస్థల సలహా మేరకు తదుపరి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఈ ప్రకటనలో తెలిపారు.

ఆర్‌సీబీ తమ అధికారిక ప్రకటనలో ఇలా పేర్కొంది. ‘‘ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల, దీనివల్ల ప్రభావితమైన వ్యక్తులు, వారి కుటుంబాల పట్ల ఆర్‌సీబీ తీవ్ర సానుభూతి వ్యక్తం చేస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం బెంగళూరులో అభిమానులు గుమిగూడినట్లు మీడియాలో వచ్చిన నివేదికలపై మేము విచారం వ్యక్తం చేస్తున్నాము. అందరి భద్రత, మంచి ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం’’ అని పేర్కొంది.

బుధవారం సాయంత్రం IPL 2025 ఛాంపియన్ జట్టు RCB ఓపెన్ బస్ పరేడ్ నిర్వహించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ కారణంగా చిన్నస్వామి స్టేడియం వెలుపల వేల సంఖ్యలో అభిమానులు గుమిగూడారు. ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ధృవీకరించారు. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే భద్రతా సంస్థల సలహా మేరకు కార్యక్రమ వ్యవధిని తగ్గించినట్లు RCB ఫ్రాంచైజీ వెల్లడించింది. బుధవారం ఉదయం RCB టీమ్ మేనేజ్‌మెంట్ ఓపెన్ బస్ పరేడ్‌ను ధృవీకరించింది. అయితే ఉదయం 11:56 గంటలకు ట్రాఫిక్ పోలీసులు బుధవారం ఎలాంటి బస్ పరేడ్ నిర్వహించటానికి పర్మిషన్ లేదని తెలిపారు.

Also Read: Bengaluru Stampede : మోడీ , చంద్రబాబు, పవన్ తీవ్ర దిగ్భ్రాంతి

ఆటగాళ్లను అరెస్ట్ చేయాలని డిమాండ్?

బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవాల్లో తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ ఘటనకు అక్కడి ప్రభుత్వం, ఆర్సీబీ ఆటగాళ్లే కారణమంటూ పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ వలనే ఇలా జరిగిందని, అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఎక్స్ వేదికగా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పోస్టులు పెడుతున్నారు. అయితే మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరు జట్టు 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించి టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ విజయంతో 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీని తొలిసారి తమ ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.