ఏపీలో వైసీపీ పార్టీ (YCP) ఘోరమైన ఓటమి చవిచూసింది..వై నాట్ 175 అంటూ చెప్పుకొచ్చిన నేతలంతా ఓటమి చెందారు. కేవలం 11 స్థానాల్లో విజయం సాధించి , ప్రతిపక్షానికి కూడా పనికిరాకుండా అయిపోయారు. ఇంత ఘోర ఓటమిని జగన్ ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాడు. ఇదిలా ఉండగానే ఇంత చెత్త పార్టీలో మీము ఉండలేమంటూ బయటకు వచ్చేందుకు నేతలు సిద్ధం అయ్యారు. తాజాగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు (Ravela Kishore Babu) పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదే క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు (Chandrababu)పై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు 2014లో తనకు రాజకీయంగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని.. తనకు సాంఘిన సంక్షేమశాఖ మంత్రిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దురదృష్టవశాత్తూ కొన్ని కారణాలతో టీడీపీలో కొనసాగలేకపోయినందుకు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటానని తెలిపారు. మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో పనిచేసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదని వాపోయారు. ఇక వైఎస్ జగన్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం తెస్తానన్న మాటలు నమ్మి తాను వైసీపీలో చేరినట్లు తెలిపారు. కానీ, ఈ ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు ఆయనను తిరస్కరించారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ది చెందాలంటే చంద్రబాబు వల్లనే సాధ్యమవుతుందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజలు అఖండ విజయం ఇచ్చారని ప్రశంసించారు.
అలాగే మందకృష్ణ మాదిగ నలబై ఏళ్లగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారని.. ఇప్పుడు ఆ అంశం ముగింపు దశకు వచ్చిందన్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబు వర్గీకరణకు మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. అందుకే తాను వైఎస్సార్‌సీపీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన ఉద్యమాన్ని సామాజిక సేవను ముందుకు తీసుకెళ్తానని.. వర్గీకరణ నెరవేరే వరకు పనిచేస్తానన్నారు. అందుకు అనుకూలంగా ఉన్న పార్టీలో చేరే విషయాన్ని ఆలోచిస్తానన్నారు.
Read Also : CBN : ‘చంద్రబాబు’ పేరును జపం చేస్తున్న నేషనల్ మీడియా