Site icon HashtagU Telugu

Rape Attempt : హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో దారుణం.. విద్యార్థినిపై ప్రోఫెస‌ర్..?

Raped

Raped

హైదరాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో దారుణం చోటుచేసుకుంది. థాయ్‌లాండ్‌కు చెందిన విద్యార్థినిపై సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ప్రోఫెస‌ర్ అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. థాయ్‌లాండ్‌కు చెందిన బాధితురాలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. హిందీ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌పై ఐపీసీసెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రొఫెసర్ తనను తన కార్యాలయానికి పిలిచి లైంగిక వేధింపులకు ప్రయత్నించాడని బాధితురాలు ఆరోపించింది. ప్రోఫెస‌ర్ నుంచి త‌ప్పించుకున్న విద్యార్థిని పోలీసుల‌ను ఆశ్రయించింది. విద్యార్థిని వేధింపుల ఆరోపణలపై ప్రొఫెసర్‌ను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు మాదాపూర్ డీసీపీ కె శిల్పవల్లి తెలిపారు.

Exit mobile version