Site icon HashtagU Telugu

Fire Accident : అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. పేలిన ఫ్రిడ్జ్‌, సిలిండర్‌

Fire Accident

Fire Accident

Fire Accident : పండుగ వేళ ఓ అపార్ట్‌మెంట్‌లో పెను ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలోని గోల్డెన్ ఒరియా అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్‌లోని మూడవ అంతస్తులోని ప్లాట్ 202లో మంటలు చెలరేగాయి. తెల్లవారు జామున 3:30 నిమిషాలకు కిచెన్‌లో ఉన్న ఫ్రిజ్ సిలిండర్ పేలింది. పెద్ద శబ్దం రావడంతో అపార్ట్‌మెంట్ వాసులు వెంటనే అలర్ట్ అయ్యారు. మంటలను చూసి ఇంట్లో ఉన్న వారు తక్షణమే బయటకు పరుగులెత్తారు. అయితే.. 5 మంది కుటుంబ సభ్యులు ప్రాణాలను కాపాడుకోగలిగారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

అయితే, సంఘటన స్థలానికి చేరుకునేందుకు ఫైర్ ఇంజన్‌కు దారి లేకపోవడంతో.. అగ్నిమాపక సిబ్బంది దాదాపు గంట పాటు శ్రమించి సంఘటన స్థలానికి చేరుకున్నారు.. చివరికి, మూడు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను పూర్తిగా అదుపు చేయగలిగారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50 లక్ష ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా. అపార్ట్‌మెంట్ బిల్డర్ యొక్క నిర్మాణ వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తమైంది. అనధికారికంగా నిర్మించిన ఆ అపార్ట్‌మెంట్ వల్ల ఈ ప్రమాదం జరిగింది అని, పోలీసులు అపార్ట్‌మెంట్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Chanakya Niti : జీవితంలోని ఈ అంశాల్లో సిగ్గుపడకండి..!

ఫైర్ అధికారి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. అగ్నిప్రమాదం జరిగిన విషయం తెల్లవారు జామున 3:30కి సమాచారం అందిందని, వారు అపార్ట్‌మెంట్‌కు చేరుకునే వరకు మంటలు బాగా విస్తరించాయని తెలిపారు. అరగంట పాటు శ్రమించి మంటలను అదుపు చేసినట్లు వెల్లడించారు. మంటలు మొదలైన కారణం ఇంట్లో ఉన్న దీపాల ద్వారా పక్కనే ఉన్న కర్టెన్స్ కు మంటలు అంటుకోవడమే అని, ఆ తరువాత, కిచెన్ సమీపంలోని ఫ్రిజ్ సిలెండర్ పేలడం కారణంగా మంటలు భారీగా విస్తరించాయని గోవర్ధన్ రెడ్డి వివరించారు. ఫైర్ ఇంజిన్లకు అపార్ట్‌మెంట్‌లోని గార్డెన్ చెట్లు ఆటంకం కలిగించడంతో, దారి లేక చాలా సమయం పట్టిందని ఆయన వెల్లడించారు.

అపార్ట్‌మెంట్ వాసులు మాట్లాడుతూ, ఫ్రిజ్ సిలెండర్ పేలిన శబ్దం విని, వెంటనే అపార్ట్‌మెంట్ నుంచి బయటకు పరిగెత్తామని తెలిపారు. వారు చెప్పారు, “అపార్ట్‌మెంట్ నిర్మాణం నిబంధనలకు అనుగుణంగా జరిగిందని తెలుసుకున్నాం. కాల్ చేయగానే ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించారనే విషయాన్ని గుర్తించాం. మూడూ ఫైర్ ఇంజిన్లు అపార్ట్‌మెంట్‌కు చేరుకుని మంటలను అదుపు చేశాయి.” వారు అదృష్టవశాత్తూ ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదని, కానీ ఆస్తి నష్టం సంభవించిందని వెల్లడించారు.

Health Tips : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉందా లేదా? మీ పాదాలను చూసి మీరు తెలుసుకోవచ్చు