బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe )లో జరిగిన బాంబు పేలుడులో కనీసం పది మంది గాయపడ్డారు. ఓ వ్యక్తి కేఫ్‌లో ఉంచిన బ్యాగ్‌లో ఉన్న ఐఈడీ వల్ల పేలుడు సంభవించింది. సీసీటీవీలో వ్యక్తిని గుర్తించినట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. ఐఈడీని పేల్చేందుకు నిందితులు ఉపయోగించిన టైమర్ పేలుడు స్థలంలో లభ్యమైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బెంగళూరులోని పోలీస్ స్టేషన్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం మరియు పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదైంది.
We’re now on WhatsApp. Click to Join.
అయితే.. నిందితుడు రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడం సీసీటీవీలో రికార్డయ్యిందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు 28 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల నిందితుడు.. కేఫ్‌లో రవ్వ ఇడ్లీని ఆర్డర్ చేసి, ఆపై తన ఆహారం తీసుకోకుండా వెళ్లిపోయాడు. నిందితుడు రవ్వ ఇడ్లీ కూపన్ తీసుకున్నాడు.. కానీ తినలేదు. ఆ తర్వాత అతను రెస్టారెంట్లో ఒక బ్యాగ్ను వదిలేశాడు, ఆ తర్వాత పేలుడు సంభవించింది. నిందితుడు బస్సులో ఇక్కడికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
అయితే తాజాగా.. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ టీమ్ అతడిని విచారిస్తున్నట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా నిన్న రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. తొలుత గ్యాస్ సిలిండర్ పేలిందని అందరూ భావించారు. కానీ ఐఈడీ వల్లే పేలుడు సంభవించిందని పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే.. రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనతో దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌లోనూ నిన్న రాత్రి నుంచి హైఅలర్ట్ ప్రకటించారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కీలక ప్రదేశాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు.
Read Also :YCP 9th List : మంగళగిరిలో గంజి కి భారీ షాక్