AP: రాఖీ పర్వదినాన..ఆడవారికి రక్షణ లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్

ఏపీలో 30 వేలకు పైగా ఆడపిల్లలు, మహిళలు అదృశ్యమయ్యారని చెబుతున్న అధికారిక గణాంకాలు గుండెల్ని పిండేస్తున్నాయని పవన్ ఆవేదన వ్యక్తం

Published By: HashtagU Telugu Desk
Raksha Bandhan Wishes From Pawan Kalyan

Raksha Bandhan Wishes From Pawan Kalyan

రాఖీ పౌర్ణమి సందర్బంగా అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్లకు రాఖీ పండుగ (Rakhi Pournami) శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). ఇదే సందర్భంలో ఏపీలో 30 వేలకు పైగా ఆడపిల్లలు, మహిళలు అదృశ్యమయ్యారని ఆవేదన వ్యక్తం చేసారు.

కుటుంబ బాంధవ్యాలకు అధిక ప్రాధాన్యమిచ్చే మన భారతీయులకు శ్రావణ పౌర్ణమినాడు వచ్చే ఈ రాఖీ పండుగ ఒక ఆనందాల వేడుక అని చెప్పుకొచ్చారు. ఈ పర్వదినం సందర్భంగా తన పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన అక్కాచెల్లెళ్లు అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడపడుచులకు అండగా ఉంటామని రక్ష కట్టించుకుంటున్న మనం.. మన కళ్లెదుట ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే మన సమాజం, ముఖ్యంగా ప్రభుత్వాలు మౌనంగా ఉండడం శ్రేయస్కరం కాదని పవన్ అన్నారు.

ఏపీలో 30 వేలకు పైగా ఆడపిల్లలు, మహిళలు అదృశ్యమయ్యారని (30000 Women Missing) చెబుతున్న అధికారిక గణాంకాలు గుండెల్ని పిండేస్తున్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ అదృశ్యాల గురించి ప్రభుత్వంలోని పెద్దలు నిమ్మకు నీరెత్తినట్లు బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంటే ఆడబిడ్డల గతేంటి అని ప్రశ్నించారు. వారి తల్లిదండ్రుల ఆర్తనాదాలు వినేవారు ఎవరు అని అన్నారు. ఆడపడుచుల పట్ల ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించినప్పుడే నిజమైన రక్షాబంధన్ అని.. ఆ రోజు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని మహిళలు అందరికీ ఈ శ్రావణ పౌర్ణమి శుభాలు కలుగచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Read Also : Vangalapudi Anitha Arrest : చంద్రబాబుకు రాఖి కట్టేందుకు వెళ్తున్న వంగలపూడి అనితను అడ్డుకున్న పోలీసులు

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాఖీ సంబరాలు మొదలయ్యాయి. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ.

  Last Updated: 30 Aug 2023, 01:49 PM IST