Site icon HashtagU Telugu

Rajinikanth : సూపర్ స్టార్ లాస్ట్ పంచ్ వైసీపీ సర్కార్ పైనేనా..? మళ్లీ కొత్త లొల్లి

Rajinikanth

Rajani

ప్రతిపక్ష పార్టీ నేతలే కాదు సినీ పరిశ్రమ అగ్ర నటులు కూడా వైసీపీ (YCP) ని టార్గెట్ గా పెట్టుకున్నారా..? ప్రస్తుతం ఇలాగే మాట్లాడుకుంటున్నారు. మొన్నటికి మొన్న మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వానికి చురకలు అంటించిన సంగతి తెలిసిందే. ఈ చురకలపై వైసీపీ నేతలు గరం గరం అవుతున్నారు. వరుసపెట్టి నేతలు మీడియా ముందుకు వచ్చి చిరంజీవి కి కౌంటర్లు ఇస్తున్నారు..మేమేమన్న తక్కువ అన్నట్లు చిరంజీవి అభిమానులు రోడ్ల పైకి వచ్చి వైసీపీ నేతలపై నిరసనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ వేడి నడుస్తుండగానే..మరో పంచ్ ను సూపర్ స్టార్ రజనీకాంత్ వదిలారనే న్యూస్ వైరల్ గా మారింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ రేపు తెలుగు , తమిళ్ భాషలలో విడుదల కాబోతుంది. ఈ మూవీ ఫై అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా చెన్నైలో ఆడియో (Jailer Audio launch) రిలీజ్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో రజనీకాంత్ (Rajini Speech) మాట్లాడుతూ.. తన గురించి ఎదుటి వాళ్లు ఏం అనుకున్నా పట్టించుకోనని .. తన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి తెలిపే ప్రయత్నం చేసారు. “మొరగని కుక్క లేదు. విమర్శించని నోరు లేదు. ఈ రెండూ జరగని ఊరు లేదు. వాటి గురించి పట్టించుకోకుండా, మనం మన పని చేసుకుంటూ పోవాలి. అర్థమైందా రాజా” అని అన్నారు. ఆయన డైలాగ్స్ కు ఫ్యాన్స్ తో పాటు చిత్ర యూనిట్ క్లాప్స్ తో మోతమోగించారు. అయితే రజనీకాంత్ అన్న ఆ డైలాగ్స్ వైసీపీ నాయకులను ఉద్దేశించి చేశారని కొంత మంది నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఎందుకంటే ఆ మధ్య ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల్లో రజినీకాంత్ ఏపీ సర్కార్ ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు( Chandrababu ) గొప్ప విజినరీ లీడర్ అని, హైదరబాద్ లో ఐటీరంగం అభివృద్దిలో చంద్రబాబు కృషి ఎంతో ఉందని, 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం గ్యారెంటీ అని రజినీకాంత్ చెప్పుకొచ్చారు. ఆ టైములో రజనీకాంత్ ఫై వైసీపీ నేతలు రెచ్చిపోయారు. అందుకే ఇప్పుడు రజనీకాంత్ వైసీపీ నేతలను ఉద్దేశించి ఆలా అన్నారని సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు. మరి దీనిపై కూడా వైసీపీ నేతలు రియాక్ట్ అవుతారేమో చూడాలి.

 

Read Also : UP: ఇదేందయ్యా ఇది.. ఈగల గోల తట్టుకోలేక వాటర్ ట్యాంక్ ఎక్కిన గ్రామస్తులు?

Exit mobile version