Site icon HashtagU Telugu

Rajasingh : వాళ్లతో పెట్టుకోవద్దంటూ కేటీఆర్ కు రాజాసింగ్ వార్నింగ్

Rajasinghvsktr

Rajasinghvsktr

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh)తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్ అయిన పోలీసు అధికారుల(Police)పై కూడా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ చెప్పిన వ్యాఖ్యలపై పోలీసులతో పెట్టుకోవద్దని రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారని గుర్తు చేస్తూ, ఇప్పుడు రేవంత్ సీఎం అయిన తర్వాత కూడా గతంలో తనను అరెస్ట్ చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేసారు.

Suryansh Shedge: నేడు గుజ‌రాత్ టైటాన్స్‌- పంజాబ్ కింగ్స్ మ‌ధ్య మ్యాచ్‌.. యువ ఆల్ రౌండ‌ర్ అరంగేట్రం?

ఎవరైతే అధికారంలో ఉంటారో, వారి ఆదేశాల ప్రకారమే పోలీసులు వ్యవహరించాల్సి వస్తుందనే నిజాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్‌కు సూచించారు. బీజేపీ కార్యకర్తలపై అనేక కేసులు పెట్టి జైలుకు పంపించారని, తనపై పీడీ యాక్ట్ కూడా పెట్టి జైలుకు పంపించారని అన్నారు. అప్పట్లో సొంత పార్టీ నేతలే తన అరెస్టుకు మద్దతుగా నిలిచారని రాజాసింగ్ ఆరోపించారు. తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని, కానీ ఇప్పుడు కూడా బీజేపీలోని కొంతమంది నేతలు తనకు వ్యతిరేకంగా వెన్నుపోటు పొడవాలనే ఆలోచనలో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు పూర్తిగా అవివేకపూరితమైనవి అని, రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని సూచించారు.