Raj Tarun – Malvi Malhotra : మాల్వి కి ‘Sorry’ చెప్పిన రాజ్ తరుణ్

Raj Tarun - Malvi Malhotra : 'ముంబైలో మీ ఇంటివద్ద జరిగినదానికి చాలా సిగ్గుపడుతున్నాను మాల్వీ. సారీ. కానీ మీ ఫ్రెండ్స్తో కలిసి వినాయక చవితిని బాగా జరుపుకొన్నాం. గణేశుడి దీవెనలు మీకు ఉండాలి'

Published By: HashtagU Telugu Desk
Raj Sorry To Malvi

Raj Sorry To Malvi

రాజ్ తరుణ్ – మాల్వీ మల్హోత్రా – లావణ్య (Raj Tarun – Malvi Malhotra-Lavanya) ల వ్యవహారం మొదట్లో కాస్త ఆసక్తి కలిగించిన ప్రస్తుతం ఛీ కొట్టిస్తుంది. రోజు రోజుకు ఈ ముగ్గురు చాల చిప్ గా వ్యవహరిస్తున్నారు. మొన్నటి వరకు రాజ్ తరుణ్ (Raj Tarun) ఫై పాజిటివ్ గా ఉన్న వారు సైతం రోజు రోజుకు వీరి వ్యవహారం దిగజారిపోతుంటే అంత ఆబ్బె అంటున్నారు. రీసెంట్ గా రాజ్ తరుణ్ ..ముంబై లోని మాల్వి ఫ్లాట్ కు వెళ్లగా..అక్కడికి కూడా లావణ్య వెళ్లి నానా రచ్చ చేసింది. ఆ తర్వాత నిన్నటికి నిన్న తన బంగారం కనిపించడం లేదని..ఆ బంగారం రాజ్ తరునే తీసుకెళ్లాడని పోలీసులకు పిర్యాదు చేసింది. ఇలా చీటికీ మాటికీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అది పోయింది..వాడు రావడం లేదు..ఇలా చిప్ గా కేసులు పెడుతుండడం తో పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఇదిలా ఉంటె ..తాజాగా రాజ్ తరుణ్ తన ట్విట్టర్ వేదికగా మాల్వి కి ‘Sorry’ చెప్పడం మరోసారి రాజ్ తరుణ్ ను వార్తల్లో నిలిచేలా చేసింది. ముంబైలో హీరోయిన్ మాల్వీ మల్హోత్రా నివాసం వద్ద నటుడు రాజ్ తరుణ్ ఉన్న సమయంలో లావణ్య అక్కడికి వెళ్లి ఆయన్ను అప్పగించాలంటూ హంగామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్వీకి రాజ్ తరుణ్ ట్విటర్లో సారీ చెప్పారు. ‘ముంబైలో మీ ఇంటివద్ద జరిగినదానికి చాలా సిగ్గుపడుతున్నాను మాల్వీ. సారీ. కానీ మీ ఫ్రెండ్స్తో కలిసి వినాయక చవితిని బాగా జరుపుకొన్నాం. గణేశుడి దీవెనలు మీకు ఉండాలి’ అని ట్వీట్ చేశారు.

Read Also : KTR Tweet : మీ కాంగ్రెస్ గూండాల బెదిరింపులకు బీఆర్ఎస్ సైన్యం భయపడదు – కేటీఆర్

  Last Updated: 12 Sep 2024, 11:01 PM IST