నవి ముంబై, అక్టోబర్ 26: India Women vs Bangladesh Women- డీవై పాటిల్ స్టేడియంలో భారత్–బంగ్లాదేశ్ మహిళల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌కి వర్షం ఆటంకం కలిగించింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సమయంలో రెండు సార్లు అంతరాయం కలిగించిన వాన, ఇప్పుడు భారత ఇన్నింగ్స్ మధ్యలో మళ్లీ ఆటను నిలిపేసింది.
భారత్ స్వల్ప లక్ష్యాన్ని సులభంగా ఛేదిస్తూ దూసుకెళ్తున్న సమయంలో 9వ ఓవర్‌లో వర్షం మొదలైంది. అప్పటికి టీమిండియా స్కోర్ 57/0. ఓపెనర్లు స్మృతి మంధాన 34 పరుగులతో, అమన్‌జోత్ కౌర్ 15 పరుగులతో అజేయంగా క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 69 పరుగులు మాత్రమే అవసరం ఉంది.
అంపైర్లు వర్షం ఆగే వరకు ఆటను నిలిపివేశారు. స్టేడియంలో వర్షం తీవ్రత తగ్గితేనే ఆట మళ్లీ ప్రారంభమవుతుంది.
