AP: ఏపీలో ఆ జిల్లాలో వర్ష సూచన.. అధికారులు అలర్ట్

  • Written By:
  • Publish Date - March 18, 2024 / 11:19 PM IST

AP: బుధవారం వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఎల్లుండి అల్లూరిసీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు అలాగే మిగిలినచోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందన్నారు.

అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.