Railway Employees: భారతీయ రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈ దీపావళికి రైల్వే శాఖ తన ఉద్యోగులకు (Railway Employees) గొప్ప వార్తను అందించింది. వాస్తవానికి దీపావళి రోజున ఇచ్చే బోనస్‌ను ఏడవ వేతన సంఘం జీతం ప్రకారం లెక్కించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను రైల్వే ఉద్యోగుల సంఘం అభ్యర్థించింది.
అయితే రైల్వే ఉద్యోగుల సంఘం ఈ అభ్యర్థనను ప్రభుత్వం అంగీకరించి నిర్ణయం వారికి అనుకూలంగా వస్తే ఈ దీపావళికి రైల్వే ఉద్యోగులందరికీ కనీసం రూ. 28,200 రూపాయల ప్రయోజనం లభిస్తుంది. ప్రభుత్వ సూచనల ప్రకారం రైల్వే ఉద్యోగులు 78 రోజుల బేసిక్ జీతంతో సమానంగా PLB బోనస్ పొందాలని IREF నొక్కి చెప్పింది.
Also Read: Pawan Kalyan: ఏడుకొండలవాడా..! క్షమించు.. పవన్11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష
ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడుకుంటే.. ఇండియన్ రైల్వే ఎంప్లాయీస్ ఫెడరేషన్ (IREF) జాతీయ ప్రధాన కార్యదర్శి సర్వ్‌జిత్ సింగ్ మాట్లాడుతూ.. ఆరవ వేతన సంఘం ప్రకారం కనీస వేతనం నెలకు రూ. 7,000, బోనస్ అందుబాటులో ఉందని చెప్పారు. ఏడో వేతన సంఘం ప్రకారం ఈ మొత్తం రూ.18,000కి పెరుగుతుంది. కనీస వేతనం రూ.7,000 ఆధారంగా పీఎల్‌బీని లెక్కించడం రైల్వే ఉద్యోగులకు అన్యాయం చేయడమేనని ఆయన అన్నారు.
ఏడవ వేతన సంఘం ఆధారంగా రైల్వేల ప్రాథమిక వేతనం రూ.18,000. దీని ప్రకారం 78 రోజులకు రూ.17,951 బోనస్ చాలా తక్కువ. రూ.18,000 బేసిక్ జీతం పరిగణనలోకి తీసుకుంటే 78 రోజుల బోనస్ రూ.46,159 అని ఐఆర్‌ఈఎఫ్ జనరల్ సెక్రటరీ తెలిపారు. ఇప్పుడు ఏడవ వేతన సంఘం ప్రకారం 78 రోజుల బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లయితే.. ప్రతి ఉద్యోగికి కనీసం (46,159-17,951) = రూ. 28,208 ప్రయోజనం లభిస్తుంది. ఏడో వేతన సంఘం ఆధారంగా బోనస్ అందజేస్తే రానున్న పండుగను సంతోషంగా జరుపుకోవచ్చని రైల్వే ఉద్యోగుల సంఘం లేఖ ద్వారా పంపిన అభ్యర్థనలో పేర్కొంది.