Rahul Gandhi: వాయనాడ్ లోక్‌సభ స్థానాన్ని వదులుకున్న రాహుల్ గాంధీ

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వాయనాడ్‌లలోని లోక్‌సభ స్థానాల నుంచి గెలుపొందిన కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ఇప్పుడు ఒకే స్థానంలో కొనసాగనున్నారు. ఈ నేపాధ్యంలో రాహుల్ కేరళలోని వాయనాడ్‌ లోకసభ స్థానాన్ని వదులుకోనున్నారు.

Rahul Gandhi: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వాయనాడ్‌లలోని లోక్‌సభ స్థానాల నుంచి గెలుపొందిన కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ఇప్పుడు ఒకే స్థానంలో కొనసాగనున్నారు. ఈ నేపాధ్యంలో రాహుల్ కేరళలోని వాయనాడ్‌ లోకసభ స్థానాన్ని వదులుకోనున్నారు.ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.

రాహుల్ గాంధీ ఎంపీ అభ్యర్థిగా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచే ఇకపై కొనసాగుతారు. ఈ క్రమంలో వాయనాడ్‌ స్థానాన్ని వదులుకోనున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం సోమవారం ఖర్గే నివాసంలో చర్చలు జరిపిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. అయితే వాయనాడ్‌ స్థానం నుంచి ఉపఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారు.

Also Read: Gautam Gambhir: ఇక కలిసి పని చేద్దాం…