New Parliament Building: కొత్తగా నిర్మితమైన పార్లమెంట్ భవనం మే28న ప్రారంభమవుతుంది . ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించబడుతుంది. ఈ మేరకు అధికారులు పెద్ద ఎత్తున ఎర్పాట్లు చేస్తున్నారు. కాగా పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించాలని, ప్రధాని కాదని రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో కొత్తగా నిర్మితమైన పార్లమెంట్ భవనంపై రాజకీయ రగడ మొదలైంది. అటు విపక్షాలు సైతం మోడీ తీరుని ప్రశ్నిస్తున్నారు.
షెడ్యూల్ ప్రకారం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నారని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. కొత్త పార్లమెంట్ భవనం విషయంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ విరుచుకుపడింది. దీన్ని ప్రధాని మోదీ ప్రాజెక్ట్‌గా కాంగ్రెస్ అభివర్ణించింది. ఇక కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించడంపై పలువురు ప్రతిపక్ష నేతలు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. పీఎం మోదీ ప్రభుత్వానికి అధిపతి అని, శాసనసభకు అధిపతి కాదని పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ఎందుకు ప్రారంభించరని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఇది ప్రజల సొమ్ముతో నిర్మించబడిందని, తన సొంత డబ్బు కాదని అన్నారు.
కాగా కొత్త పార్లమెంట్ హౌస్ త్రిభుజాకార ఆకారంలో నాలుగు అంతస్తుల భవనం రూపంలో నిర్మించబడింది. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు.
Read More: Target Telangana : ఇక కాంగ్రెస్ టార్గెట్ తెలంగాణ.. 24న కీలక భేటీ