Rahul Gandhi Disqualified: రాహుల్ పై అన‌ర్హ‌త వేటు

కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీని( Rahul Gandhi Disqualified)అన‌ర్హ‌త వేటు

  • Written By:
  • Updated On - March 24, 2023 / 03:04 PM IST

Rahul Gandhi Disqualified : కాంగ్రెస్ పార్టీ యాక్టింగ్ ప్రెసిడెంట్  ఎంపీ రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు వేస్తూ లోక్ స‌భ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని దూషిస్తూ చేసిన వ్యాఖ్య‌ల క్ర‌మంలో ఇలాంటి సంచ‌ల‌న నిర్ణ‌యం లోక్ స‌భ సెక్ర‌టేరియెట్ వెల్ల‌డించింది. గ‌తంలో ఇలాంటి బ‌హిష్క‌ర‌ణలు పెద్ద‌గా లేవు. సూర‌త్ కోర్టు రాహుల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై రెండేళ్ల జైలు శిక్ష వేసింది. దాన్ని బేస్ చేసుకుని రాహుల్ పై(Congress) అన‌ర్హ‌త వేటు వేసింది.  భార‌త్ శిక్షాస్మృతి ఆర్టిక‌ల్‌102(1)(ఈ) 1951 పీపుల్స్ యాక్ట్ ప్ర‌కారం రాహుల్ మీద అన‌ర్హ‌త వేటు ప‌డింది.

రాహుల్ ను అన‌ర్హునిగా ప్ర‌క‌టించిన త‌రువాత కాంగ్రెస్ నేతృత్వంలోని విప‌క్షాలు నిర‌స‌న‌కు దిగాయి. “ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది` అనే బ్యాన‌ర్ ను ప్ర‌ద‌ర్శిస్తూ రాష్ట్రపతి భవన్ వైపు కవాతు నిర్వ‌హించారు. పోలీసులు వాళ్ల క‌వాతును భ‌గ్నం చేస్తూ ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు. సమీపంలోని పోలీస్ స్టేషన్‌లకు తరలించడం ద్వారా నిర‌స‌న యాత్ర‌ను పోలీసులు భ‌గ్నం చేశారు. రాష్ట్రపతి కూడా విప‌క్ష నేత‌ల‌కు అపాయిట్మెంట్ ఇవ్వ‌లేదు.

Also Read : Rahul Gandhi: మోడీ పై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు .. సూరత్ కోర్టు కీలక తీర్పు

అదానీ-హిండెన్‌బర్గ్ ఇష్యూను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చేత విచార‌ణ చేయించాల‌ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ముతో సమావేశం కావాలని విప‌క్ష లీడ‌ర్లు అనుకున్నారు. పరువునష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి శిక్ష విధించడం చుట్టూ బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, హిండెన్ బ‌ర్గ్ బంధంపై చ‌ర్చ‌ను ప‌క్క‌దోవ పెట్టించాల‌ని బీజేపీ చూస్తుంద‌ని ఆరోప‌ణ‌ల‌కు దిగారు. ఎల్‌ఐసి వంటి రాష్ట్ర-అనుసంధాన సంస్థలతో పెట్టుబ‌డి పెట్టించ‌డం, SBI స్టాక్ మానిప్యులేషన్ ఆరోపణలతో అదానీ షేర్లు పడిపోయాయి. ఇలాంటి అంశాల‌ను బ‌య‌ట‌పెడుతోన్న విప‌క్షాల‌పై రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటోందని ఆరోపిస్తూ పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఏకకాలంలో నిరసనలు చేపట్టాయి.

సూరత్ కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న కాంగ్రెస్  (Rahul Gandhi Disqualified)

రాహుల్ వ్యాఖ్య‌ల‌పై సూరత్ కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు (Congress) డీకే శివకుమార్‌తో పాటు ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలను కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోడీని ‘దొంగ’ వ్యాఖ్యల‌తో పోల్చుతూ OBC కమ్యూనిటీని అవమానించిన తర్వాత స్వతంత్ర న్యాయవ్యవస్థ నుండి దోషిగా నిర్ధారించబడిందని బిజెపి పేర్కొంది.

వివాదాస్పద లండన్ వ్యాఖ్యలపై స్పందించడానికి సమయం కోరుతూ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసిన రాహుల్ బీజేపీకి టార్గెట్ అయ్యారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష నేతలను కేంద్రం వేటాడుతుందని కాంగ్రెస్ చీఫ్, ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రాహుల్ గాంధీపై క‌క్ష్య సాధింపును నిర‌సిస్తూ

సభా కార్యక్రమాల ప్రారంభానికి ముందు పార్టీ ఎంపీల సమావేశం తర్వాత రాహుల్‌ లోక్‌సభ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ (Congress)కూడా హాజరయ్యారు. పలు అంశాలపై గందరగోళం నెలకొనడంతో సభ ప్రారంభమైన కొన్ని సెకన్ల తర్వాత సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ పార్లమెంటు నుంచి వెళ్లిపోయారు. ‘దొంగలందరికీ `మోదీ` అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది? అనే అంశంపై సూర‌త్ కోర్టు వేసిన జైలు శిక్ష మీద పిటిష‌న్ వేయ‌డంతో బెయిల్ మంజూరు చేసింది. పై కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి వీలుగా శిక్షను 30 రోజుల పాటు సస్పెండ్ చేసింది.

Also Read : Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లిన పోలీసులు.. అసలేం జరిగిందంటే?

రాహుల్ గాంధీపై క‌క్ష్య సాధింపును నిర‌సిస్తూ 12 పార్టీ ల సభ్యులు పార్లమెంటులోని కాంగ్రెస్ చీఫ్, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ సూరత్ కోర్టు తీర్పు “దురదృష్టకరం” అని అన్నారు. అతను అదానీ-హిండెన్‌బర్గ్ సమస్యను లేవనెత్తినప్పటి నుండి ప్రభుత్వం రాహుల్ ను మాట్లాడకుండా ఆపడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు సూర‌త్ కోర్టు తీర్పు చాలా దురదృష్టకరం. కాంగ్రెస్తో క‌లిసి సంఘీభావ యాత్ర చేయ‌డానికి 12 పార్టీల లీడ‌ర్లు ముందుకొచ్చారుర. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరారు. అక్క‌డ నుంచి అనుమ‌తి లేకుండా రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వ‌ర‌కు పాద‌యాత్ర‌కు క‌దిలారు. దీంతో మ‌ధ్య‌లోనే పోలీసులు వాళ్ల పాద‌యాత్ర‌ను భ‌గ్నం చేశారు. ఆలోపుగా లోక్ స‌భ సెక్ర‌ట‌రియేట్ రాహుల్ మీద అన‌ర్హ‌త వేటు(Rahul Gandhi Disqualified)వేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

 Also Read : Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లిన పోలీసులు.. అసలేం జరిగిందంటే?