Radhika Merchant: వామ్మో అంబానీ కోడలు హాండ్ బ్యాగ్ ఖరీదు తెలిస్తే నోరేళ్ళ బెట్టాల్సిందే?

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ముఖేష్ అంబానీ గురించి ఆయన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్

  • Written By:
  • Publish Date - April 2, 2023 / 07:45 PM IST

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ముఖేష్ అంబానీ గురించి ఆయన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి అందరికి తెలిసిందే. ప్రపంచంలో ఉన్న అత్యంత ధనికులలో ముఖేష్ అంబానీ కూడా ఒకరు. కాగా ముఖేష్ అంబానీ భార్య నీతూ అంబానీ గురించి మనందరికీ తెలిసిందే. ముఖేష్ అంబానీ నీతా అంబానీ ల కొడుకు అనంత్ అంబానీ. అనంత్ అంబానీ కాబోయే భార్య రాధిక మర్చంట్ గురించి మనందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ అయినా నీతా అంబానీ కలల ప్రాజెక్టు అయినా నీతా ముఖేష్ అంబానీ సంస్కృతిక కేంద్రం తాజాగా ప్రారంభమైంది. ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సదా ఈ కార్యక్రమానికి ఈ దేశంలోని పలువురు రాజకీయ సినీ, అలాగే కీడా ప్రముఖులు సైతం హాజరయ్యారు. ఇది ఇలా ఉంటే ఈ కార్యక్రమంలో అనంత్ అంబానీ ఆయనకు కాబోయే భార్య రాధిక మర్చంట్ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటీవల నిశ్చితార్థాన్ని పూర్తి చేసుకున్న ఈ జంట తాజాగా మొదలైన ఆ కార్యక్రమానికి జంటగా హాజరయ్యారు. ఇద్దరు కూడా బ్లాక్ కలర్ డ్రెస్ లో మెరిసిపోయారు. కాగా ఆ కార్యక్రమంలో అందరీ దృష్టి రాధిక చేతిలో ఉన్న ఒక చిన్న బ్యాగ్ పై పడింది.

అంతేకాకుండా ఆ హ్యాండ్ బ్యాగ్ గురించి సోషల్ మీడియాలో జోరుగా వార్తలు కూడా. కామ్ అనే వెబ్సైట్ ఆ బ్యాగు ఖరీదును వెల్లడించింది. ఆ చిన్న బ్యాగు ఖరీదు దాదాపుగా రూ. 52 లక్షలు అని తెలిపింది. ఆ చిన్న బ్యాగు ఖరీదు తెలిసి చాలామంది నోరెళ్ళ పెడుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన కొందరు నెటిజెన్స్ వాళ్లకున్న కోట్ల ఆస్తిలో అదేం పెద్ద లెక్క కాదు అని లైట్ గా తీసుకుంటున్నారు. ఇంకొందరు మాత్రం అంత చిన్న బ్యాగు అంత ఖరీదా అని ఆశ్చర్యపోతున్నారు.