ఉక్రెయన్‌పై రష్యా సైన్యం విరుచుకుపడుతుంది. ఏడు రోజులుగా జరుగుతున్న హోరాహోరి పోరులో.. రష్యా సైనిక దళాలు ఒకవైపు బాంబులతో మరోవైపు క్షిపణులతో ఉక్రెయిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు, రెండో పెద్ద నగరమైన ఖార్కివ్‌లో జనావాసాలే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోంది. ఈ క్రమంలో గత 24 గంటల్లో ఉక్రెయిన్ సైనికుల కంటే అక్కడ సాధారణ పౌరుల మరణాలే ఎక్కువగా నమోదయినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇక రష్యాను దారికి తెచ్చేందుకు అమెరికాతో పలు దేశాలు రష్యా పై ఆంక్షలు విధిస్తున్నాయి. అయితే మరోవైపు పుతిన్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా తన లక్ష్యం వైపు దూసుకెళుతున్నారు. ఈ క్రమంతో తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు పుతిన్. అంతరిక్ష పరిశోధన సంస్థలోని సైంటిస్టులను తిరిగి రష్యాకు రప్పిస్తున్నాడు. ఈ క్రమంలో 29 మంది సైంటిస్టులు బుధవారం మాస్కోకు చేరుకున్నట్టు సమాచారం. అలాగే మిగిలిన 59 మంది సైంటిస్టులను ఏ క్షనమైనా వెనక్కి రప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. పుతిన్ తాజా నిర్ణయంతో అంతరిక్ష పరిశోధన కేంద్రంపై గుత్తాధిపత్యం చేస్తున అమెరికాకు ఊహించని దెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.