Pushpa-2 Pre Release: పుష్ప-2 సినిమానే కాదు.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ (Pushpa-2 Pre Release) కూడా లెంగ్తీనే అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప-2 ఈవెంట్ దాదాపు నాలుగు గంటలు సుదీర్ఘంగా సాగింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు సభా ప్రాంగణంలోకి వెళ్లిన అభిమానులు రాత్రి 11.40 వరకూ అంతే హుషారుగా ఉన్నారు. రాజమౌళి రాక కొంత సర్‌ప్రైజ్ చేసింది. అసలు ఈ వేడుకకు అతిథులెవరూ ఉండరేమో అనుకున్నారంతా.. కానీ జక్కన్న వచ్చి కాస్త ఆశ్చర్యపరిచారు.
అల్లు అర్జున్ స్పీచ్ ఎప్పటిలానే అభిమానులకు కిక్ ఇచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ మాటలు వింటే మైత్రీతో లుకలుకలు తగ్గినట్టే కనిపించాయి. శ్రీలీల, రష్మిక, అనసూయ కాస్త గ్లామర్ అద్దారు. అల్లు అర్జున్ వారసులు ఆయాన్, అర్హల రాక సెంట్రాఫ్ అట్రాక్షన్ అయ్యింది. సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ని మెచ్చుకోవడం చూస్తే.. ఆర్.ఆర్ విషయంలోనూ టీమ్ ఖుషీ అయినట్టు తెలిసిపోతోంది. మొత్తంగా ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లా కాకుండా ఓ సక్సెస్ సెలబ్రేషన్‌లా అనిపించింది. అంతే కాకుండా అల్లు ఆయాన్, అర్హల స్పీచ్ విని బన్నీ ఎక్స్‌ప్రెషన్స్ వైరల్‌గా మారాయి. డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతుంటే బన్నీ, రష్మికలు కాస్త ఎమోషనల్ అయినట్లుగా కనిపించింది.
Also Read: Mudragada Giri: వైఎస్ జగన్ నయా స్ట్రాటజీ… ముద్రగడ గిరికి కీలక బాధ్యతలు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ పుష్ప-2. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 4వ తేదీన ఓవర్‌సీస్‌లో విడుదల కానుంది. ఈ మూవీలో రష్మిక మందాన్న కథనాయిక. సునీల్, అనసూయ, ఫహాద్, జగపతిబాబు, రావు రమేష్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్, టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 5 కోసం ఇప్పటికే బుకింగ్స్ కూడా మొదలైన విషయం తెలిసిందే.