Site icon HashtagU Telugu

Pulwama Attack: దారుణం.. ఉగ్రదాడిలో సెక్యూరిటీ గార్డు మృతి

Shooting In Philadelphia

Open Fire

కశ్మీర్‌ లోయలోని పుల్వామా (Pulwama)లో ఉగ్రవాదులు మరోసారి హత్యకు పాల్పడ్డారు. ఆదివారం కాశ్మీరీ పండిట్ సంజయ్ శర్మపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. హుటాహుటిన సంజయ్ శర్మను సమీప ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం ప్రకారం.. పుల్వామాలోని అచన్ ప్రాంతానికి చెందిన సంజయ్ శర్మ కుమారుడు కాశీనాథ్ శర్మ (వయస్సు సుమారు 40 సంవత్సరాలు) ఆదివారం ఏదో పని కోసం మార్కెట్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఉగ్రవాదులు వారిపై దాడి చేశారు. ఈ దాడిలో అతడు గాయపడ్డాడు. స్థానికులు పోలీసుల సహాయంతో ఆస్పత్రికి తరలించినా ప్రాణాపాయం తప్పలేదు.

సంజయ్ శర్మ బ్యాంకు సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడని చెబుతున్నారు. మరోవైపు పోలీసులు, భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. పుల్వామాలోని ఆచాన్‌లో నివసిస్తున్న సంజయ్ శర్మ హత్యను ఖండిస్తున్నట్లు బీజేపీ నేత అల్తాఫ్ ఠాకూర్ తెలిపారు. మనుషుల ప్రాణం తమకు పట్టదని ఉగ్రవాదులు మరోసారి నిరూపించారు. భద్రతా బలగాలు నిందితులను అంతం చేస్తాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఎవరినీ అనుమతించబోమన్నారు.

Also Read: Manish Sisodia: ఈ రోజు నన్ను అరెస్టు చేస్తారు: ఢిల్లీ డిప్యూటీ సీఎం

ఉగ్రవాదుల దాడిలో మరణించిన కాశ్మీరీ సంజయ్ శర్మ మృతి పట్ల ఒమర్ అబ్దుల్లా సంతాపం వ్యక్తం చేశారు. పుల్వామా జిల్లాలోని ఆచాన్‌లో నివాసం ఉంటున్న సంజయ్ పండిట్ మరణ వార్త విని చాలా బాధపడ్డాను. సంజయ్.. బ్యాంకు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. మరోవైపు.. పోలీసులు ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల కోసం తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు.