Varanasi : మోడీ ఫై ప్రియాంక గాంధీ పోటీ..?

ప్రియాంక గాంధీ.. ప్రధాని మోడీ నియోజకవర్గమైన వారణాసి నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ లీడర్

Published By: HashtagU Telugu Desk
Priyanka Gandhi vs PM Modi in Varanasi?

Priyanka Gandhi vs PM Modi in Varanasi?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక ఫై కసరత్తులు చేస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ మరింత దూకుడు పెంచింది. ఇదే సమయంలో కీలక నేతల పోటీఫై కూడా కసరత్తులు చేస్తున్నాయి.

రాహుల్ గాంధీ యూపీలోని అమేఠి నుంచి పోటీ చేస్తారని ఇప్పటికే ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కి కంచుకోట అయిన అమేఠిలో 2019లో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓటమిపాలయ్యారు. ఈ సారి ఇక్కడే నిలబడి గెలిచి తీరాలన్న పట్టుదలతో రాహుల్ ఉన్నట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. రాహుల్ పోటీ వార్త బయటకు వచ్చినప్పటి నుండి దీని గురించే అంత మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) .. ప్రధాని మోడీ (PM Modi) నియోజకవర్గమైన వారణాసి (Varanasi) నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ లీడర్ రషీద్ అల్వి (Rashid Alvi) కీలక వ్యాఖ్యలు చేసి మరింత చర్చ పెంచారు. ప్రియాంక వారణాసిలో పోటీ చేస్తే…ప్రధాని మోడీ గుజరాత్‌కి వెళ్లిపోతారని, మళ్లీ తిరిగి రారని సెటైర్లు వేశారు. రాహుల్ అమేఠీ నుంచి పోటీ చేస్తే స్మృతి ఇరానీకి డిపాజిట్‌ గల్లంతవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి.

ఈ కామెంట్స్ ఫై బిజెపి నేతలు సైతం కౌంటర్లు వేస్తున్నారు. కాంగ్రెస్‌కి ఓట్లు అడిగే హక్కే లేదని బీజేపీ నేత తరుణ్ చుగ్ విమర్శలు గుప్పించారు. అమేఠి ప్రజలు రాహుల్‌ని ఓడించారని, మళ్లీ పోటీ చేసినా ఓడిస్తారని ధీమా వ్యక్తం చేసారు. మరి నిజంగా ప్రియాంక ..మోడీ ఫై పోటీ చేస్తుందా..? అనేది చూడాలి.

Read Also : Jayaprada : బీఆర్ఎస్‌లోకి జయప్రద.. ? పోటీ ఎక్కడి నుండి అంటే..

  Last Updated: 19 Aug 2023, 07:02 PM IST