Site icon HashtagU Telugu

Priyanka Gandhi: ఇబ్బంది పెట్టిన వాళ్లకు అభినందనలు : ప్రియాంక గాంధీ

Priyanka Gandhi

Priyanka Gandhi

Priyanka Gandhi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. అనూహ్య ఫలితాలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమౌతోంది. ఇక కాంగ్రెస్ పార్టీకి అభినందనలు అంటూ బీఆర్ఎస్ అఫీషియల్ ‘ఎక్స్’ ఖాతా వేదికగా స్పందించింది. ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ శిరసావహిస్తోందని, ప్రజాతీర్పును విశ్లేషించుకుని ముందుకు సాగుతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క బాధ్యతలు చేపట్టనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ విజయంపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు స్పందించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మరియు రాజస్థాన్ ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని చెప్పారు. ప్రతిపక్ష పాత్ర వహించి ప్రజల కోసం పోరాటం చేస్తామని అన్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయంపై తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని రాహుల్ గాంధీ అన్నారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి చరిత్ర సృష్టించారన్నారు ప్రియాంక గాంధీ. ఇది తెలంగాణ ప్రజల విజయం. ఇది తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి, ఒక కార్యకర్తకు దక్కిన విజయం అని ప్రియాంక గాంధీ అన్నారు. తెలంగాణలో శాంతి, శ్రేయస్సు, ప్రగతి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులపై దాడులు చేశారు, ప్రచారాన్ని చెడగొట్టారు, మోడీ-షాలతో పాటు దర్యాప్తు సంస్థలకు అభినందనలు చెప్పారామె.

Also Read: T20I Series : చివరి టీ ట్వంటీలోనూ భారత్ విక్టరీ…సిరీస్ 4-1తో కైవసం