Amit Shah: రామోజీ, షా ఏకాంత చర్చలు

మునుగోడు వ‌చ్చిన బీజేపీ అగ్ర నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స‌భ ముగిసిన త‌ర్వాత చెరుకూరి రామోజీరావుతో భేటీ అయ్యారు.

Published By: HashtagU Telugu Desk
Ramoji Rao And Amit Shah

Ramoji Rao And Amit Shah

మునుగోడు వ‌చ్చిన బీజేపీ అగ్ర నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స‌భ ముగిసిన త‌ర్వాత చెరుకూరి రామోజీరావుతో భేటీ అయ్యారు. స‌భ ముగిసిన త‌ర్వాత హైద‌రాబాద్‌కు తిరుగు ప్ర‌యాణంలో భాగంగా అమిత్ షా న‌గ‌ర శివారులోని రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా అమిత్ షాకు రామోజీ రావు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.అనంత‌రం ఫిల్మ్ సిటీలోని హోట‌ల్‌కు వెళ్లిన అమిత్ షా, రామోజీ రావులు ఏకాంతంగా భేటీ అయ్యారు.

అమిత్ షా వెంట కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి స‌హా ప‌లువురు నేత‌లు ఉన్నా, అమిత్ షా, రామోజీ రావుల భేటీలో వారెవ‌రూ పాల్గొన‌లేదు. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే ముగిసిన ఈ భేటీలో అమిత్ షా, రామోజీ రావుల మ‌ధ్య ప‌లు అంశాల‌పై చ‌ర్చ జ‌రిగిన‌ట్టు స‌మాచారం.

  Last Updated: 21 Aug 2022, 11:40 PM IST