Site icon HashtagU Telugu

PM Modi : ఏపీలో వచ్చే నెల 8న ప్రధాని మోదీ పర్యటన

Modi Ap

Modi Ap

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) జనవరి 8న పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. బీజేపీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. పర్యటనలో ప్రధాని కొన్ని కీలక ప్రాజెక్టుల ప్రారంభం చేయనున్నారని , అలాగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు అని పేర్కొన్నారు.

అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం , రాష్ట్రంలోని ప్రజల జీవితనైతిక స్థితిని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి ప్రధాని వివరించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని సాంకేతిక, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్ రంగాల్లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఆయా ప్రాజెక్టులు రాష్ట్రంలోని ప్రజలకు ఉన్నతమైన సేవలను అందించడానికి మరింత పటిష్టమైన మౌలిక వసతులు అందించనున్నట్లు బిజెపి వర్గాలు పేర్కొన్నాయి.

ఎన్నికల్లో బిజెపితో కలిసి జనసేన, టీడీపీ పోటీ చేసి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మోడీ సహకారం తో ఈరోజు రాష్ట్రం ఎంతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. ఇప్పటికే వేలాది కోట్లు రాష్ట్రానికి అందజేసి మోడీ..ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.

Read Also : Spirituality: రూపాయి బిళ్ళతో గురువారం రోజు ఇలా చేస్తే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే!

Exit mobile version