Prime Minister Modi: ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్ టూర్ క్యాన్సిల్‌!

జనవరి 29న మౌని అమావాస్య రోజున ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్‌లో అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది భక్తులు మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు.

Published By: HashtagU Telugu Desk
PM Modi To Kumbh

PM Modi To Kumbh

Prime Minister Modi: ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Modi) ఫిబ్రవరి 5న ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లటంలేదు. మహాకుంభం సందర్భంగా తొక్కిసలాట జరగడంతో స్నానాల కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి నెలలో ఏ రోజైనా ప్రధాని మోదీ కుంభస్నానానికి వెళ్లవచ్చని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. దీంతో పాటు మహాకుంభ్‌లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ప్రయాగ్‌రాజ్‌లో వాహనాల ప్రవేశంపై నిషేధం విధించారు. అలాగే అమృత స్నాన్ రోజున వీఐపీల రాకపై కూడా ఆంక్షలు ఉండనున్నాయి.

జనవరి 29న మౌని అమావాస్య రోజున ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్‌లో అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది భక్తులు మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. యూపీ పోలీసులు మొదట ఈ తొక్కిసలాటను దాచడానికి ప్రయత్నించారు. అయితే అదేరోజు రాత్రి సంఘటన గురించి సమాచారం ఇస్తూ మృతుల సంఖ్యను వెల్ల‌డించారు. ఘటన జరిగిన ఒక రోజు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రద్దీని నియంత్రించడానికి, భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

వసంత పంచమి స్నానోత్సవ ఏర్పాట్లపై డీజీపీ ప్రశాంత్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ గురువారం సమావేశమయ్యారు. ఇందులో బసంత్ పంచమి, మాఘి పూర్ణిమ, మహాశివరాత్రి సహా ఇతర ప్రధాన స్నానోత్సవాల్లో వీఐపీలు మహాకుంభానికి వెళ్లరాదని నిర్ణయించారు.

Also Read: Virat Kohli Trolls Delhi Crowd: ఎవరూ తిని రాలేదా? ఫ్యాన్స్ లో జోష్ నింపిన కోహ్లీ

29.64 కోట్ల మంది స్నానాలు చేశారు

యూపీ ప్రభుత్వ లెక్కల ప్రకారం గురువారం సాయంత్రం 4 గంటల వరకు 1.77 కోట్ల మంది గంగా, సంగంలో స్నానాలు చేశారు. ఇప్పటి వరకు 29.64 కోట్ల మంది భక్తులు స్నానాలు చేశారు. ఫిబ్రవరి 26 వరకు జరిగే ఈ కుంభమేళాకు కోట్లాది మంది ప్రజలు హాజరవుతారని అంచనా.

భ‌క్తుల భ‌ద్ర‌త కోసం ఐదుగురు ప్రత్యేక కార్యదర్శి స్థాయి అధికారులను కూడా ఫెయిర్ డ్యూటీకి వినియోగిస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. వీరంతా ఫిబ్రవరి 12 వరకు ప్రయాగ్‌రాజ్‌లోనే ఉంటారు. బుధవారం మౌని అమావాస్య సందర్భంగా 7.64 కోట్ల మంది ప్రజలు గంగ, సంగమంలో స్నానాలు చేశారు. ఒక్కరోజులో అత్యధిక సంఖ్యలో భక్తులు స్నానాలు చేయడం ఇదే మొద‌టిసారి.

 

  Last Updated: 31 Jan 2025, 08:31 AM IST