రాష్ట్రంలో సంచలనం రేపిన అప్సర హత్య కేసులో ప్రధాన నిందితుడు పూజారి సాయికృష్ణకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో సాయికృష్ణను అరెస్ట్ చేసిన శంషాబాద్ పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పోలీసులు సాయికృష్ణను చర్లపల్లి జైలుకు తరలించారు.
ఇక, హైదరాబాద్‌లో మిస్సింగ్ అయిన అప్సరను ఆమె ప్రియుడు పూజారి సాయికృష్ణ హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అప్సర మిస్సింగ్ ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసులో మిస్టరీని చేధించారు. అయితే ఇదివరకే సాయికృష్ణకు పెళ్లి అయిందని.. అయితే గత కొన్నాళ్ల నుంచి అప్సరతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారని పోలీసులు గుర్తించారు. అయితే వివాహం చేసుకోవాలని అప్సర ఒత్తిడి చేయడంతో, తమ వివాహేతర సంబంధం బయటపడుతుందని ఆమెను సాయికృష్ణ హత్య చేసినట్టుగా పోలీసులు కనుగొన్నారు.
Also Read: Epic Haj Journey: సలాం షిహాబ్.. 8640 కిలోమీటర్లు నడిచి, మక్కాను దర్శించుకొని!