Weather : రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. సాధారణంగా జూన్ మొదటి వారంలో ప్రభావాన్ని చూపే నైరుతి రుతుపవనాలు ఈసారి కాస్త ముందుగానే రాగా… ఇప్పుడు అవి అడ్డంగా నెమ్మదించిపోయాయి. దీంతో ఎప్పుడెప్పుడు కురుస్తాయా అని ఎదురు చూస్తున్న వర్షాలకు విరామం ఏర్పడింది. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నప్పటికీ, రాష్ట్రం మొత్తం మీద మళ్లీ వేసవి పరిస్థితులు కనిపిస్తున్నాయి.
వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం, పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణాన్ని మించిపోయాయి. సాధారణంగా ఉండాల్సినదానికంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి. కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల వరకు పెరిగాయి. దీనివల్ల ప్రజలు ఎండ నుంచి తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు.
Covid 19: అనంతపురం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు
వాతావరణ శాఖ అంచనా ప్రకారం, రుతుపవనాల్లో తిరిగి కదలిక వచ్చే అవకాశం ఈ నెల 10వ తేదీ తర్వాతే కనిపిస్తోంది. అంటే అప్పటివరకు ఎక్కువగా వేడి వాతావరణమే కొనసాగనుంది. రానున్న 2-3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల మధ్య ఉండే అవకాశముంది.
అయితే వర్షాకాలం ప్రారంభంలో ఇలా కొన్ని రోజుల విరామం రావడం సహజమైనదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది ఆందోళనకరం కాదని, వాతావరణం సహజ రీతిలోనే తన మార్పులు చాటుతోందని వివరించారు.
ప్రస్తుతం రోజు పగటిపూట ఉక్కపోత, రాత్రిపూట కొద్దిపాటి చల్లదనం ఉండనుంది. అలాగే సాయంత్రం వేళల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. జూన్ రెండో వారం తర్వాత రుతుపవనాలు చురుగ్గా మారి, వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు.
Mahabali Frog: ఏమిటీ మహాబలి కప్ప..? సంవత్సరానికి ఒకేసారి భూమిపైకి వచ్చే అద్భుత జీవి..!