Pranitha Pregnancy: ప్రెగ్నెంట్ విమెన్స్ పై ప్రణీత ఇంట్రెస్టింగ్ కామెంట్..!!

అత్తారింటికి దారేది సినిమా హీరోయిన్, కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

  • Written By:
  • Publish Date - April 15, 2022 / 10:02 AM IST

అత్తారింటికి దారేది సినిమా హీరోయిన్, కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాను గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది ఈ బ్యూటీ. ఇప్పుడు గర్భం దాల్చే తల్లులందరికీ సూర్తినిచ్చే విధంగా ఒక పోస్టును షేర్ చేసింది ప్రణీత. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో తన భర్తతో కలిసి జిమ్ లో వ్యాయామం చేస్తున్న ఫోటోను షేర్ చేసింది. ఆమె జిమ్ లో లైట్ స్ట్రెచ్ లు చేస్తూ కనిపించింది ప్రణీత. అంతేకాదు తన భర్త నితిన్ రాజుతో మిర్రర్ సెల్ఫీని కూడా తీసుకుంది.

తన భర్తతో తీసుకున్న వీడియోలు, మిర్రర్ సెల్ఫీలను షేర్ చేసిన ప్రణీత…దీనిని తేలికగా ఉంచడం అని క్యాప్షన్ ఇచ్చింది.  జిమ్ సెషన్ కోసం ప్రణీత ప్రింటెడ్ టీ, బ్లాక్ బైకర్ షార్ట్ ను ధరించింది. తన బేబీ బంప్ ను చూపిస్తూ…గర్భం దాల్చిన సమయంలో ఫిట్ గా  ఎలా ఉండాలన్న దానిపై సలహాలు కూడా ఇచ్చింది. అంతేకాదు ప్రెగ్నెంట్ విమెన్స్ పై ప్రణీత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రణీత ఫిట్నెస్ గోల్స్ గర్బిణీ స్త్రీలందరికీ ఫిట్ నెస్ లక్ష్యాలను ఇస్తుందని చెప్పవచ్చు. ఇక ప్రణీత ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రణీత పోస్టు పై నెటిజన్లను ప్రేమను కురిపిస్తున్నారు.