టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా ఏపీలో టికెట్స్ ఇష్యూ పై పెద్ద ఎత్తున రగడ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఇటీవల టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యి, చిత్రపరిశ్రమలోని సమస్యలు గురించి జగన్‌కు వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించడమే కాకుండా, తాజాగా కొత్త టికెట్ రేట్స్ అండ్ ఐదు షోలకు సంబంధించి జీవోను ఏపీ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.
ఈ నేపధ్యంలో మెగా స్టార్ చిరంజీవితో సహా పలువురు సినీ ప్రముఖులు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డార్లింగ్ ప్రభాస్ కూడా జగన్ అండ్ పేర్ని నానీలకు ధన్యవాదాలు తెల్పుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సీఎం జగన్ అండ్ మంత్రి పేర్న నాలను ట్యాగ్ చేసినా పెద్దగా ఎవరికీ రీచ్ అవలేదు. ఎందుకంటే ఆ పోస్టు తన ఫేస్‌బుక్ ఖాతా నుంచి ప్రబాస్ పోస్టు చేశాడు.
జనరల్‌గా ప్రభాస్ తన సినిమాల గురించి కానీ, ఇతర విషయాల గురించి కానీ ఇన్స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తాడు. తన ఇన్‌స్టాలో ఏదన్నా పోస్టు చేయగానే అది బాగా వైరల్ అవుతుంది. అయితే కరెక్ట్‌గా తన సినిమా విడుదలకు ముందు టికెట్ రేట్స్ పెంచుతూ జీవో ఇచ్చిన జగన్‌కు థ్యాంక్స్ చెబుతూ ఫేస్‌బుక్‌లో మాత్రమే పోస్టు చేసి, ఇన్‌స్టాలో పోస్టు చేయకపోవడం ఆశక్తిగా మారింది. దీంతో ప్రభాస్ ఇలా గుట్టుచప్పుడు కాకుండా కేవలం ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనే పోస్టు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని ఇప్పుడు సర్వత్రా సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.