వైసీపీ మద్దతుదారుడు, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)ని రాయచోటి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ వ్యాప్తంగా ఆయనపై పలు కేసులు నమోదవ్వడంతో, హైదరాబాద్‌లోని రాయదుర్గం ‘మై హోమ్ భుజా’ అపార్ట్‌మెంట్ వద్ద పోలీసులు హుటాహుటిన చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Mahakumbh: మహా కుంభమేళా.. 45 రోజుల్లో 65 కోట్ల మందికి పైగా భక్తులు!
తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి నేత నారా లోకేష్‌లపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పలు ప్రాంతాల్లో పోలీసు కేసులు నమోదయ్యాయి. పోసాని కృష్ణ మురళి తన రాజకీయ అభిప్రాయాలను ఎప్పుడూ ధైర్యంగా చెప్పే వ్యక్తిగా పేరుపొందారు. అయితే ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. టీడీపీ, జనసేన నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో, ఆయా పార్టీల అభిమానులు, నేతలు పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రాయచోటి కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని, ఏపీకి తరలించేందుకు చర్యలు చేపట్టారు. పోసాని అరెస్ట్ వార్తపై వైసీపీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, టీడీపీ – జనసేన శ్రేణులు దీనిని స్వాగతిస్తున్నాయి.