Site icon HashtagU Telugu

Khammam Public Meeting: రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి

Khammam Public Meeting

Whatsapp Image 2023 07 02 At 7.18.49 Pm

Khammam Public Meeting: ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభలో భాగమయ్యారు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ. లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జనగర్జన అట్టహాసంగా ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలు ఈ సభకు హాజరయ్యారు. ఇక సభకు వచ్చే జనాన్ని అధికార పార్టీ అడ్డుకున్నప్పటికీ వారంతా పాదయాత్రతో ఖమ్మం చేరుకోవడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సభ వేదికగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు.

జనగర్జన వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సభ వేదికగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. పొంగులేటితో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు రాహుల్ సమక్షంలో పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ రావు ఠాక్రే తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More: Telangana BJP: అధ్య‌క్షుడి మార్పుపై క్లారిటీ ఇచ్చిన కిష‌న్ రెడ్డి .. బండి, ఈట‌ల ఎడ‌మొహం పెడ‌మొహం