ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) నివాసం వద్ద భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసం మరియు పార్టీ కేంద్ర కార్యాలయం సమీపంలో రక్షణ చర్యలు చేపట్టారు. ఇటీవల పార్టీ కార్యాలయం ఎదురుగా ఉన్న గార్డెన్‌లో గడ్డి తగలబడి మంటలు చెలరేగిన ఘటన నేపథ్యంలో పోలీసులు భద్రతను మరింత పెంచారు.
Indiramma Housing Scheme Rules : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిబంధనలు
ఈ ఘటనపై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజీ పరిశీలించాలని పోలీసుల నుంచి విజ్ఞప్తి వచ్చినా, వైసీపీ కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీనితో, పోలీసులు జగన్ ఇంటి వద్ద భద్రతా చర్యలను మరింత ముమ్మరం చేశారు. అలాగే తాడేపల్లి పోలీస్ స్టేషన్ మానిటరింగ్ సిస్టమ్‌కు కనెక్ట్ చేయబడిన ఎనిమిది సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో పాటు గార్డెన్‌లో మంటలు చెలరేగిన ప్రాంతం నుంచి మట్టి, బూడిద నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పరీక్ష కోసం పంపించారు. ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తూ దర్యాప్తును వేగవంతం చేశారు.