Site icon HashtagU Telugu

Hyderabad : జగన్ బ్రాండ్ తో హైదరాబాద్ లో సె** రాకెట్…!

Jublihils S Racket

Jublihils S Racket

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌(Jubilee Hills)లో మరోసారి వ్యభిచార మాఫియా (Prostitution Mafia) వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి, సంచలన నిజాలను బహిర్గతం చేశారు. ఈ అపార్ట్‌మెంట్‌ను కేంద్రంగా చేసుకుని అనేకమంది యువతులను వ్యభిచారంలో దింపి, తమ స్వార్ధం కోసం వారిని బలితీర్చుకుంటున్నారు. ఈ రాకెట్‌ను నాయక్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Beauty Tips: కరివేపాకు ఉసిరి నూనె ఉపయోగిస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!

పోలీసుల దర్యాప్తులో థాయిలాండ్, బంగ్లాదేశ్‌ నుంచి మహిళలను అక్రమంగా భారత్‌కు రప్పించి, వీరిని ఈ దందాలోకి దించారని తేలింది. వీరి పాస్‌పోర్టులు, వ్యక్తిగత వివరాలు స్వాధీనం చేసుకుని వారి కదలికలను పూర్తిగా నియంత్రణలో పెట్టారు. ఈ దందా “బూమ్ బూమ్” పేరుతో ఆన్లైన్ ద్వారా కూడా జరుగుతున్నట్టు గుర్తించారు. సోషల్ మీడియా, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫాంలలో కస్టమర్లను ఆకర్షిస్తూ సేవలు అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. బాధిత యువతులను రక్షణ కేంద్రాలకు తరలించి, వారి దేశాలకు తిరిగి పంపే ప్రక్రియను ప్రారంభించారు. డబ్బుకోసం ఇలా అమ్ముడవుతున్న యువతుల విషాదకథకు ఇది మరో ఉదాహరణగా నిలిచింది.