Hunger Strike: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తలపెట్టిన దీక్షకు పోలీసుల అనుమతి దొరకలేదు. గతంలో వైఎస్ షర్మిల పాదయాత్రకు పలుమార్లు అనుమతి నిరాకరించిన పోలీసులు.. ఇప్పుడు మరోసారి షాకిచ్చారు. దీంతో కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అదీ కుదరకపోతే తన పార్టీ కార్యాలయం ఎదుట దీక్ష కొనసాగించాలని భావిస్తున్నారు. ఈ విషయంపై పార్టీ నేతలతో చర్చిస్తున్నారు షర్మిల.
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గత కొంత కాలంగా అధికార పార్టీపై పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఆమె T-SAVE ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద దీక్షకు పూనుకున్నారు. రేపు ఏప్రిల్ 17న షర్మిల అఖిలపక్ష నేతలతో దీక్ష చేయనున్నారు. ఈ సందర్భంగా పోలీసుల అనుమతి కోరగా.. దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ట్రాఫిక్ జామ్ సమస్యల పేరుతో దీక్షకు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తుంది. దీక్షకు అనుమతి లేకపోవడంతో తదుపరి కార్యాచరణపై పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ఏం చేయాలనే దానిపై లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌టీపీ కార్యాలయంలో నేతలతో చర్చిస్తున్నారు.హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకోవడమా.. లేక పార్టీ కార్యాలయం వద్ద దీక్ష కొనసాగించాలా అనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు వైఎస్సార్‌టీపీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Read More: YS Sharmila: కేసీఆర్ కు షాక్.. రేవంత్, బండికి షర్మిల ఫోన్!