KTR: కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ కారణంగా పోలీసులు, ప్రత్యేక అధికారులు ముమ్మురంగా తనిఖీలు చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - November 1, 2023 / 12:52 PM IST

KTR: భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు వాహనాన్ని పోలీసులు, ఎన్నికల సిబ్బంది తనిఖీ చేశారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కామారెడ్డి వెళుతున్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు వాహనాన్ని పోలీసులు ఎన్నికల సిబ్బంది తనిఖీ చేశారు. తూప్రాన్ వద్ద మంత్రి వాహనాన్ని ఆపడంతో కేటీఆర్ తన వాహన తనిఖీకి పూర్తిగా సహకరించారు. తనిఖీ అనంతరం కేటీఆర్ కామారెడ్డి బయలుదేరారు.

తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ కారణంగా పోలీసులు, ప్రత్యేక అధికారులు ముమ్మురంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా డబ్బు పట్టుబడుతుండటంతో అధికారులే షాక్ అవుతున్నారు. ఎన్నికల కారణంగా జరిపిన తనిఖీలో ఇప్పటి వరకు రూ.400 కోట్ల మార్కును దాటిందని అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో రూ.16.16 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: CM Jagan: పొట్టిశ్రీరాములు త్యాగ ఫ‌లంతోనే ప్ర‌త్యేక రాష్ట్రం: సీఎం జగన్